Homeఎంటర్టైన్మెంట్Ram Pothineni latest news: హీరో రామ్ ని అవమానించిన యంగ్ హీరోయిన్.. షూటింగ్ నుండి...

Ram Pothineni latest news: హీరో రామ్ ని అవమానించిన యంగ్ హీరోయిన్.. షూటింగ్ నుండి వాకౌట్..

Ram Pothineni latest news: ఈమధ్య కాలం లో పాపం హీరో రామ్ పోతినేని కి అసలు ఏమి కలిసి రావడం లేదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. ఆయన గత చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని , 40 కోట్ల రూపాయలకు […]

Ram Pothineni latest news: ఈమధ్య కాలం లో పాపం హీరో రామ్ పోతినేని కి అసలు ఏమి కలిసి రావడం లేదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. ఆయన గత చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని , 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టిన రామ్ ని చూసి , ఎట్టకేలకు కుర్రాడు ఫార్మ్ లోకి వచ్చాడు, ఇక తన టాలెంట్ కి తగ్గ సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు , వరుస ఫెయిల్యూర్స్ తో అభిమానులను , ప్రేక్షకులను నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన డైరెక్టర్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.

తనని ఆకర్షించే కథలు రాకపోవడం తో , స్వయంగా ఆయనే ఒక కథని రాసుకున్నాడు. ముందుగా డైరెక్టర్స్ కోసం చాలా వెతికాడు , ఎవ్వరూ దొరక్కపోవడం తో స్వీయ దర్శకత్వం లోనే ఈ చిత్రం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు రామ్. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం కేజీఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి ని సంప్రదించారని , ఆమె కూడా ఈ చిత్రం లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో నటించడం కోసం శ్రీనిధి శెట్టి డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కి షాకైన నిర్మాతలు ఆమెని ఈ చిత్రం నుండి తప్పించినట్టు తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి గత చిత్రాలకు కోటి రూపాయిల కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చేది. కానీ ఈ చిత్రానికి ఆమె ఏకంగా కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

ప్రస్తుతం రామ్ కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉందని , తన వల్ల ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది కాబట్టే, ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని ఆమె డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది హీరో రామ్ స్టేటస్ కి అవమానం లాంటిదే అని చెప్పొచ్చు. సక్సెస్ ట్రాక్ లో లేకపోతే ఎవ్వరూ కూడా విలువ ఇవ్వరు , సందర్భాన్ని చూసి ఇలా డిమాండ్ చేస్తారు అనడానికి ఇదొక ఉదాహరణ. అయితే శ్రీనిధి శెట్టి ని ఈ చిత్రం నుండి తప్పించిన మేకర్స్, ‘డ్రాగన్’ ఫేమ్ కాయదు లోహర్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. యూత్ లో ప్రస్తుతం ఈమెకు మంచి క్రేజ్ ఉంది , అందంతో పాటు అద్భుతంగా నటించగల కెపాసిటీ ఉంది , రెమ్యూనరేషన్ కూడా తక్కువే అవ్వడం తో , ఆమెని లాక్ చేసినట్టు సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper