Rashmika Kriti Sanon viral video: ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు అభిమానుల నుండి ఎదురయ్యే అత్యుత్సాహం కారణంగా ఎలాంటి ఇబ్బందులను , పరిణామాలను ఎదురుకుంటున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. నిధి అగర్వాల్ కి గత ఏడాది జరిగిన సంఘటన ని అంత తేలికగా మరచిపోలేము. ‘రాజా సాబ్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని ‘లుల్లూ మాల్’ లో ఏర్పాటు చేసిన సాంగ్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన నిధి అగర్వాల్ అభిమానుల తాకిడి ని తట్టుకోలేకపోయింది. ఆ తోపులాట లో ఆమె బట్టలు కూడా చిరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. సెక్యూరిటీ ఆమెని సురక్షితంగా కారు ఎక్కించడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఆ తర్వాత సమంత , అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్ , ఇలా ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు జరిగింది.
ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ హీరోయిన్ , నేషనల్ క్రష్ రష్మిక మందాన విషయం లో కూడా జరగబోయింది, సమయానికి ఆమె తో పాటు ఉన్న మరో హీరోయిన్ కృతి సనన్ తేరుకొని రక్షించడం తో రష్మిక సురక్షితంగా బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరో గా నటించిన ‘కాక్ టైల్ 2’ చిత్రం ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రష్మిక, కృతి సనన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా నిన్న వీళ్ళు ఒక షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఈ ముగ్గురు నటీనటులు చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు విచ్చేసారు. ఆరంభం లో అంతా బాగానే ఉంది , అభిమానులతో వీళ్ళు కలిసి సరదాగా వడాపావ్ కూడా తిన్నారు. కానీ స్టేజి మీదకు వచ్చినప్పుడే అసలు సమస్య ఎదురైంది.
అభిమానులు బారికేడ్లను బద్దలు కొట్టుకొని స్టేజి మీదకు దూసుకొని రావడం మొదలు పెట్టారు. దీంతో తీవ్రమైన గందరగోళ వాతావరణం ఎదురైంది. హీరోయిన్ రష్మిక అయితే భయపడిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న కృతి సనన్ రష్మిక కి రక్షణా కవచం లాగా మారిపోయింది. తన రెండు చేతులతో రష్మిక ని గట్టిగా హత్తుకొని , అభిమానుల తాకిడి నుండి కాపాడుతూ , జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అనుకోకుండా ఏర్పడిన ఈ గందరగోళం కారణంగా ఈవెంట్ ని మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది, హీరో షాహిద్ కపూర్ కూడా తీవమైన అసహనానికి గురయ్యాడు. ఇకపోతే హీరోయిన్ కృతి సనన్ రష్మిక పట్ల చూపించిన ప్రేమ, శ్రద్ద లపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయం లో ఈవెంట్ నిర్వాహకులపై నెటిజెన్స్ మండిపడుతున్నారు.
