Homeఎంటర్టైన్మెంట్Ram Pothineni next movie director: 'దర్శకుడు కావలెను'.. పాపం హీరో రామ్ పరిస్థితి ఇలా...

Ram Pothineni next movie director: ‘దర్శకుడు కావలెను’.. పాపం హీరో రామ్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి..

Ram Pothineni next movie director: ఒక హీరో కెరీర్ దశాబ్దాల పాటు స్థిరమైన మార్కెట్ ని కొనసాగించాలంటే , కచ్చితంగా సరైన స్క్రిప్ట్ సెలక్షన్ ఉండడం ముఖ్యం. ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు , ఇలాగే స్క్రిప్ట్ సెలక్షన్ లో బలహీనంగా ఉండడం వల్ల, వరుస ఫ్లాప్స్ ని అందుకొని, ఇండస్ట్రీ నుండే వైదొలగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి స్టేజి కి బాగా దగ్గర్లో ఉన్న హీరోల్లో ఒకరు రామ్ పోతినేని(Ram Pothineni). […]

Ram Pothineni next movie director: ఒక హీరో కెరీర్ దశాబ్దాల పాటు స్థిరమైన మార్కెట్ ని కొనసాగించాలంటే , కచ్చితంగా సరైన స్క్రిప్ట్ సెలక్షన్ ఉండడం ముఖ్యం. ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు , ఇలాగే స్క్రిప్ట్ సెలక్షన్ లో బలహీనంగా ఉండడం వల్ల, వరుస ఫ్లాప్స్ ని అందుకొని, ఇండస్ట్రీ నుండే వైదొలగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి స్టేజి కి బాగా దగ్గర్లో ఉన్న హీరోల్లో ఒకరు రామ్ పోతినేని(Ram Pothineni). మొదటి సినిమా ‘దేవదాస్’ లో ఈ హీరో నటన, ఎనర్జీ ని చూసి కచ్చితంగా పెద్ద స్టార్ హీరో అవుతాడని అప్పట్లో అందరూ అనుకున్నారు. కందిరీగ సినిమా వరకు ఈ హీరో కి స్టార్ హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ కూడా వచ్చేవి. కానీ ఆ తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి. స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం తో , ఈ కుర్ర హీరో కెరీర్ లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వచ్చాడు.

మధ్యలో కొన్ని హిట్స్ వచ్చాయి, ఆ తర్వాత అంతకు మించిన ఫ్లాప్స్ కూడా వచ్చాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, ఈ కుర్ర హీరో చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఫలితంగా మార్కెట్ రిస్క్ లో పడింది. అయితే రామ్ తదుపరి చిత్రం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. స్వయంగా రామ్ ఒక కథని రాసుకున్నాడు. ఈ కథ కోసం ఆయన డైరెక్టర్స్ వేట మొదలు పెట్టాడు. కానీ ఒక్కరు కూడా రామ్ రాసిన కథం తెరకెక్కించడానికి ఆసక్తి చూపించడం లేదు. రీసెంట్ గానే ఈ స్టోరీ ని తెరకెక్కించడానికి లోకేష్ కనకరాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన లోకి విగ్నేష్ ముందుకొచ్చాడు. కానీ స్క్రిప్ట్ డెవలప్ చేసే క్రమం లో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో విగ్నేష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

మరి ఇప్పుడు రామ్ ఎవరితో పని చెయ్యబోతున్నాడు అనేది పెద్ద ప్రశ్న. హరీష్ శంకర్ ఎప్పటి నుండో రామ్ తో ఒక సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ రామ్ మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేడు, అదే విధంగా తనతో నేను శైలజ , ఉన్నది ఒక్కటే జిందగీ వంటి చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల తో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన లో ఉన్నాడు రామ్. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper