Ram Pothineni: దే..దే.. దేవదాస్ అంటూ అందరి ముందుకు వచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రామ్ పోతినేని. ఇప్పటికీ దేవదాస్ సినిమాకు ఫుల్ అభిమానులు ఉన్నారు. రామ్ తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి కానీ ప్రసాదుల జాబితా ఎక్కువగానే ఉంది. అదేనండి స్టార్ హీరోలు కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. ఇంతకీ ఎందుకు అంటే కారణం చెప్పరే.. మరి ఈ లిస్ట్ లోకే రామ్ కూడా వస్తారు. ఇంతకీ ఏమైందంటే..
తాజాగా రామ్ పోతినేనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈయన ఓ బుల్లితెర నటిని ప్రేమించారట. అంతేకాదండోయ్.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. మీ అభిమాన క్యూట్ హీరోకు పెళ్లి చేయాలని వాళ్ల ఫ్యామిలీ ఎప్పటి నుంచో తెగ ట్రై చేస్తున్నారట. అందుకోసం ఎన్నో సంబంధాలు కూడా చూశారట. కానీ మన రామ్ ఒప్పుకుంటే గా.. ఏదో ఒక వంక పెడుతూ నో చెప్పేస్తున్నారట.
మరి దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారా? శ్రీసత్య అనే టాక్ అయితే ఉందండి బాబూ.. వీరిద్దరు కలిసి ఓ షోలో పాల్గొంటే.. శ్రీ సత్య రామ్ కు ప్రపోజ్ చేసింది. దీనికి సమాధానం రాకపోయినా.. రామ్ కు కూడా ఇష్టమనే తెలుస్తోంది. అయితే బుల్లితెర నటిని ొక హీరో ప్రేమించడం అంటే షాకే అంటున్నారు నెటిజన్లు. కానీ వీరిద్దరికి ముందు నుంచే పరిచయం ఉందనే టాక్ వల్ల ఇందులో నిజం ఉంది అంటున్నారు కొందరు. శ్రీ సత్యకు రామ్ పోతినేని అంటే ఫుల్ లవ్ అట.
రామ్ ను పెళ్లి చేసుకోవాలని శ్రీ సత్య తెగ ఆశపడుతుందట. సత్యకు రామ్ ఎక్కడ కనిపించినా చాలు.. తన లవ్ ను ఎఫ్పటికప్పుడు ఎక్స్ ప్రెస్ చేస్తూనే ఉంటుందట. ఇలా ఈమె ప్రేమకు ఫిదా అయిన రామ్ తను కూడా లవ్ ట్రాక్ ఎక్కాడని టాక్. అంతేకాదు త్వరలో ఫ్యామిలీలతో మాట్లాడాలనుకుంటున్నారట. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది వారు స్పందిస్తే గానీ తెలియదు.