Skanda: బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా భారీ అంచనాలతో గత నెల చివరన రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అవరేజ్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమాలో తన మార్క్ ఆఫ్ యాక్షన్ తో బోయపాటి ఈ సినిమాని తీసి ప్రేక్షకుల చేత మంచి ప్రశంశలు అందుకున్నాడు… ఇంతకుముందు బాలయ్య బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలను ఏ విధంగా అయితే తన యాక్షన్ ఎపిసోడ్ లో ఇన్వాల్వ్ చేసి చూపించాడో హీరో రామ్ పోతినేని కూడా దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో చూపించాడు.
అయితే రామ్ అంటే ఇంతకుముందు చాక్లెట్ బాయ్ అని అందరూ అనుకునేవారు. కానీ ఎప్పుడైతే పూరి తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసాడో అప్పటి నుంచి ఆయన ఇమేజ్ మొత్తం మారిపోయింది మాస్ అవతారం ఎత్తాడు. అందుకే ఈ సినిమాలో కూడా ఫుల్ మాస్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన పాత్రకి మంచి పేరు అయితే వచ్చింది.
అలాగే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలకి ఏ మాత్రం తీసుపోకుండా రామ్ మాస్ ఎలివేశన్స్ లో అదరగొట్టి అందరి చేత ఊర మాస్ అని అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమా చూసిన అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటి అంటే ఈ సినిమాలో రామ్ చేసిన క్యారెక్టర్ పేరుని ఎక్కడ కూడా ప్రస్తావించడం జరగలేదు.కాబట్టి ఆయన పేరు ఏంటి అనేది ఎవరికీ తెలియడం లేదు దానికి సంబంధించినది ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా రామ్ ఒక క్యారెక్టర్ లో కాలేజీ స్టూడెంట్ గా నటించాడు ఆ క్యారెక్టర్ పేరు భాస్కర్ రాజు కాగా, మొరాకో నుంచి వచ్చిన రామ్ క్యారెక్టర్ పేరు మణికంఠ స్కంద రాజ్… అయితే ఈ సినిమా చూసిన చాలామందికి ఈ పేర్లు ఏంటో తెలియక కన్ఫ్యూజన్ కి గురయ్యారు. అందుకే వాళ్లకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ పేర్లను తీసుకురావడం జరిగింది…
ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా 7 రోజులలో 31 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 47 కోట్ల వరకు వసూళ్ల ను సాధించాల్సింది ఉంది.అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి బాలయ్య బాబుతో మరో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రామ్ కూడా పూరి జగన్నాథ్ తో ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు…