Ram Pothineni: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో రామ్ పోతినేని(Ram Pothineni) కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. ఈయన గురించి సోషల్ మీడియా లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ భొర్సే(Bhagyasri Bhorse) తో ప్రేమాయణం లో ఉన్నాడని, వీళ్లిద్దరి కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని, ఈ ఏడాది లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. వీళ్లిద్దరు కలిసి నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం ఈ నెల 28 న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. అందులో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ భాగ్య శ్రీ తో ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నువ్వుంటే చాలే పాట రాసాను. ఈ పాటని నేను హీరోయిన్ భాగ్యశ్రీ ని దృష్టిలో పెట్టుకొని రాసానని, మేమిద్దరం ప్రేమలో ఉన్నామని చాలా కథనాలు వచ్చాయి. కానీ అందులో ఒక్క శాతం కూడా నిజం లేదు. ఆ పాట ని నేను రాసినప్పుడు మా సినిమా లో హీరోయిన్ ఎవరో కూడా ఖరారు అవ్వలేదు. అసలు నాకు ప్రేమ మీద ఎలాంటి ఆసక్తి లేదు. ఇప్పటి వరకు ఎవ్వరిని చూసినా నాకు అలాంటి ఫీలింగ్ కలుగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియా లో ఇన్ని రోజులు రామ్,భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. దీని సంగతి పక్కన పెడితే అసలు రామ్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా?, 38 ఏళ్ళ వయస్సు వచ్చింది, కానీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని అంటున్నారు.
ఇక ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. గతం లో ఆయన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు రెండవ సినిమా. ఇందులో సూపర్ స్టార్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని గ్రాండ్ గా విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే రామ్ ఈసారి చాలా పెద్ద హిట్ కొట్టేలాగానే అనిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. మరి గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్న రామ్ ఈసారైనా హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి.