Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma Middle East War Explanation: మిడిల్ ఈస్ట్ యుద్ధానికి అసలు కారణం...

Ram Gopal Varma Middle East War Explanation: మిడిల్ ఈస్ట్ యుద్ధానికి అసలు కారణం చెప్పిన రాంగోపాల్ వర్మ.. వైరల్

Ram Gopal Varma Middle East War Explanation: మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఇజ్రాయిల్ ఇరాన్ మీద ఎందుకు దాడులు చేస్తోంది.. మధ్యలో అమెరికా ఎందుకు ప్రవేశించింది.. చైనా ఎందుకు ఇరాన్ కు పరోక్షంగా సహకారం అందిస్తోంది? ఈ ప్రశ్నలకు యుద్ధ రంగ నిపుణులు.. అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న సమాధానాలు ఒక విధంగా ఉన్నాయి. అయితే పై ప్రశ్నలకు ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. Also Read: […]

Ram Gopal Varma Middle East War Explanation: మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఇజ్రాయిల్ ఇరాన్ మీద ఎందుకు దాడులు చేస్తోంది.. మధ్యలో అమెరికా ఎందుకు ప్రవేశించింది.. చైనా ఎందుకు ఇరాన్ కు పరోక్షంగా సహకారం అందిస్తోంది? ఈ ప్రశ్నలకు యుద్ధ రంగ నిపుణులు.. అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న సమాధానాలు ఒక విధంగా ఉన్నాయి. అయితే పై ప్రశ్నలకు ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధానికి కారణం అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ కాదట. ఈ యుద్ధానికి జీసస్, అల్లా కారణమట. ఈ యుద్ధం జీసస్, అల్లా మధ్య జరుగుతుందట. ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా సరే వారి మతంలోకి తాను వెళ్లిపోతానని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. అమెరికాలో మెజారిటీగా క్రిస్టియన్లు ఉన్నారు. ఇరాన్ దేశంలో ముస్లింలు మాత్రమే ఉంటారు. ఈ రెండు మతాలకు సంబంధించిన సిద్ధాంతాల మధ్య పోరు సాగుతోందని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మరో రకమైన చర్చకు దారితీస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. ఇరాన్ ఒంటరిగా పోరాటం చేస్తోంది. కాకపోతే చైనా ఇరాన్ దేశానికి పరోక్షంగా సహకారం అందిస్తోంది. దీనికి తోడు ఇరాన్ గల్ఫ్ దేశాలపై విస్తృతంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాలలో ప్రధానమైన దుబాయ్.. ఇతర నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దుబాయ్ నగరంలో విమానాశ్రయం.. ఓడరేవులు.. హోటళ్లు ధ్వంసం అయ్యాయి.

రాంగోపాల్ వర్మ ఇప్పుడు మాత్రమే కాదు.. అనేక సందర్భాలలో ఇటువంటి వివాదాస్పదమైన ట్వీట్లు అనేకం చేశారు. ఏదైనా సంఘటన జరిగితే.. దానికి అతడు సొంత భాష్యం చెబుతాడు. జరుగుతున్న చర్చను మరోవైపు తీసుకెళ్తాడు. దీనివల్ల అసలు విషయం పక్కదారి పడుతుంది. తెరపైకి రకరకాల విశ్లేషణలు వస్తాయి. ఇప్పుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కూడా అదే విధంగా ఉంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాంగోపాల్ వర్మ టిడిపిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసేవారు. అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసేవి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో సరికొత్త చర్చకు కారణమయ్యేవి. ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఏకంగా మిడిల్ ఈస్ట్ యుద్ధం మీద ఈ స్థాయిలో ట్వీట్ చేయడం సంచలనం కలిగిస్తోంది.

రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ తో చాలామంది ఏకీభవిస్తున్నారు. దేవుడిని నమ్మని రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఒక మతంలోకి మారిపోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. రాంగోపాల్ వర్మ ఆకాంక్ష ప్రకారమైనా మిడిల్ ఈస్ట్ యుద్ధం ఆగిపోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper