Homeఅంతర్జాతీయంMiddle East War: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం... మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

Middle East War: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

Middle East War: మిడిల్ ఈస్ట్ లో భీకరమైన యుద్ధం సాగుతోంది. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం లెక్కచేయడం లేదు. పైగా దూకుడుగా దాడులు చేస్తోంది. ఏకకాలంలో గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. Also Read: శకుని రాజకీయాల మధ్య చిక్కుకున్న దక్షిణాసియా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న దాడులు ప్రపంచ వ్యాప్తంగా చమురు వ్యాపారం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే చమురుకు డిమాండ్ […]

Middle East War: మిడిల్ ఈస్ట్ లో భీకరమైన యుద్ధం సాగుతోంది. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం లెక్కచేయడం లేదు. పైగా దూకుడుగా దాడులు చేస్తోంది. ఏకకాలంలో గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

Also Read: శకుని రాజకీయాల మధ్య చిక్కుకున్న దక్షిణాసియా

మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న దాడులు ప్రపంచ వ్యాప్తంగా చమురు వ్యాపారం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే చమురుకు డిమాండ్ జరిగింది. యూరప్ దేశాలలో సహజవాయువుకు డిమాండ్ పెరిగింది. భారత్ వద్ద కేవలం 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా భారత్ కు చమురును సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. త్వరలోనే చమురును పంపించనుంది.

మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతున్న తీరు మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహకంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ అత్యంత శక్తివంతమైన మిస్సైల్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడులలో భీకరమైన ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం చోటు చేసుకుంటున్నాయి. ఈ స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ.. అమెరికా అనేక రకాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా అమెరికా మీద ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రజలు హెచ్చరిస్తున్నారు. అమెరికా సాగిస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ లో ఖమేనీ అంతం కావడాన్ని ఇతర వర్గాలకు చెందిన ప్రజలు స్వాగతిస్తున్నారు. ఖమేనీ మృతి చెందడం తమకు లభించిన స్వాతంత్ర్యమని అభివర్ణిస్తున్నారు.

మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంలో భారత్ బ్రహ్మోస్ పని గురించి చర్చ నడుస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ శక్తివంతమైన మిస్సైల్స్ ప్రయోగిస్తున్నప్పటికీ.. బ్రహ్మోస్ గురించి యుద్ధరంగ నిపుణులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మోస్ అనేది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఇది ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో దూసుకుపోతుంది. శత్రువుల రాడార్ లకు చిక్కకుండా ఖచ్చితమైన వేగంతో లక్ష్యాన్ని చేదిస్తుంది. నేల, ఆకాశం, నీటి నుంచి దీనిని ప్రయోగించడం సులభం. దీనిని ఫైర్ అండ్ ఫర్గెట్ ఆయుధమని యుద్ధరంగ నిపుణులు చెబుతుంటారు. దీనిని భారత్, రష్యా సంయుక్తంగా సృష్టించాయి.

ఇటీవల అమెరికా ఇజ్రాయిల్ లు ఇరాన్ రెవల్యూషన్ గారి గార్డ్ కార్యాలయంపై దాడి చేయబోయి దాని పక్కనే ఉన్న స్కూల్ పై బాంబులు మిసైల్ లు వేశారు. దీంతో 160 మంది బాలికలు చనిపోయారు. అత్యాధునిక ఆయుధాలు వాడే అమెరికా ఇజ్రాయిల్ వంటి దేశాలు కూడా ఖచ్చితత్వంతో దాడులు చేయలేక చతికిల పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కచ్చితంగా దాడి చేసిన భారత క్షిపణి రక్షణ సామర్థ్యం బ్రహ్మాస్ గురించే చర్చ జరుగుతోంది. మన బ్రహ్మోస్ అత్యంత కచ్చితంగా పాక్ పై దాడి చేయడంతో అమెరికా ఇజ్రాయిల్ కంటే మన క్షిపణి 100 రెట్లు బెటర్ అని అందరూ ప్రశంసిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper