Homeఎంటర్టైన్మెంట్Peddi Movie: 'పెద్ది' చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న జాన్వీ కపూర్..

Peddi Movie: ‘పెద్ది’ చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న జాన్వీ కపూర్..

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు , ఈ సినిమాని భారీ రేట్స్ పెట్టి కొనుగోలు చేసిన బయ్యర్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతున్నారు. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ లో సరైన హిట్ లేదు , విడుదలైన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తూ వచ్చాయి. బయ్యర్స్ చేతిలో ఒక్క రూపాయిల రొటేషన్ కూడా […]

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు , ఈ సినిమాని భారీ రేట్స్ పెట్టి కొనుగోలు చేసిన బయ్యర్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతున్నారు. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ లో సరైన హిట్ లేదు , విడుదలైన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తూ వచ్చాయి. బయ్యర్స్ చేతిలో ఒక్క రూపాయిల రొటేషన్ కూడా లేదు. అలాంటి సమయం లో ఎన్నో ఆశల మధ్య విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి 220 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, కేవలం మొదటి వారం లోనే 170 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుకి ఈ చిత్రం చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది కాసేపు పక్కన పెడితే , ఈ చిత్రం లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పై ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినీ సెలబ్రిటీలు సైతం ఈ అంశంపై స్పందించారు , ఎక్కువ శాతం మంది జాన్వీ కపూర్ కి సపోర్టుగా నిలిచారు. అయితే తనకు ఈ చిత్రం లో బోల్డ్ సన్నివేశాల్లో ఇష్టం లేకపోయినప్పటికీ డైరెక్టర్ డిమాండ్ ని బట్టే చేశానని సోషల్ మీడియా లో ఆమెకు సంబంధించిన ప్రైవేట్ చాట్ ఒకటి లీకైంది. ఇది నిజమా ?, అబద్దమా అనేది పక్కన పెడితే , ‘పెద్ది’ మూవీ మాత్రం జాన్వీ కపూర్ కి చాలా గొప్ప మేలు చేసింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ముందుగా ఈ చిత్రం లో నటించేందుకు ఆమె 6 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కి ఒప్పుకుంది. కానీ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో , మేకర్స్ ఆమెకు 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. రీసెంట్ గానే ఈ అమౌంట్ ని సెటిల్ చేసినట్టు తెలుస్తోంది.

ఒక విధంగా చెప్పాలంటే జాన్వీ కపూర్ మీద జరిగిన నెగెటివ్ పబ్లిసిటీ , ఈ సినిమా పై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరూ జాన్వీ కపూర్ ని ఈ స్థాయిలో విమర్శిస్తున్నారు, అంతలా ఆమె ఏమి చేసిందో చూద్దాం అని ఈ చిత్రానికి కదిలినవాళ్లు చాలా మంది ఉన్నారు. అలా ఆమె ఫ్యాక్టర్ ఈ సినిమాకు ఒక రేంజ్ పబ్లిసిటీ మెటీరియల్ గా మారడంతో మేకర్స్ ఆమెకు అదనంగా రెమ్యూనరేషన్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి , పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధులుగా విచ్చేసే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper