Katrina kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో కత్రినా కైఫ్ ఒకరు తన నటనతో డాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ అమ్మడు. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ జంట బహిరంగంగా మాత్రం ఎప్పుడు తమ ప్రేమ వ్యవహారాన్ని తెలియజేయలేదు. కత్రినా విక్కీఈ ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకోన్నట్లు సోషల్ మీడియాలో వార్తల్లో కూడా వచ్చాయి. అయితే తాజాగా పొలిటికల్ వార్తలు వైరల్‌గా నిలిచింది ఈ అమ్మడు.

Also Read: హాలీవుడ్ ఎంట్రీ ని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన సమంత…
ప్రస్తుత కాలంలో సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అది చిన్న విషయమైనా సోషల్ మీడియా వేదికలో ట్రెండింగ్ పోతుంది. అలనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రెండ్రోజుల కిందటే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం తెలిసిందే. ఆ విధంగా రాజేంద్ర సింగ్ గుధా రాజస్థాన్ కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే మంత్రిగా ప్రమాణం చేసిన మూడో రోజే హీరోయిన్ కత్రినా కైఫ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర సింగ్ గుధా.
అయితే ఇటీవల తన సొంత నియోజకవర్గం ఉదయ్ పూర్వతిలో రాజేంద్ర పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడికొచ్చిన ప్రజలతో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయగా అక్కడి ప్రజలు రోడ్డు సమస్య గురించి వివరించగా సంబంధిత అధికారిని పిలిపించి ప్రజల సమస్యలు నేరుగా ఆయనకు తెలిపారు. రాజేంద్ర మాట్లాడుతూ నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి ఆ హీరోయిన్ బుగ్గలు ఉన్నంత నాజూగ్గా రోడ్లు కావాలి అంటూ అనగా దీంతో అక్కడున్న ప్రజలంతా నవ్వారు. ప్రస్తుతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
Also Read: విడాకుల వదంతులపై ప్రియాంక దంపతులు స్పందన.. ఆ ఒక్క పోస్ట్‌తో రూమర్స్‌కు చెక్