Sampoornesh: హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా ఎదిగారు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమా సంపూర్ణేష్ బాబును ఒక సెలబ్రిటీ రేంజ్ కి తీసుకువెళ్లిన చిత్రంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత విడుదలైన కొబ్బరి మట్ట, సింగం 123 వంటి చిత్రాలతో ప్రేక్షకులను మరింత నవ్వుల పంచారు ఈ బర్నింగ్ స్టార్. ఇటీవల ఆయన ద్విపాత్రాభినయంతో ‘క్యాలీఫ్లవర్’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు చిత్ర బృందం. అయితే ఈ శుక్రవారం థియేటర్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంపూ.. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు.

Also Read: బాలయ్యకు విలన్ గా అంటే భయమేసింది అంటున్న శ్రీకాంత్…
“ఈ సినిమా శీలం అనేది ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకీ ముఖ్యమే అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు రావు అనే అంశం చుట్టూ ఈ కథని అల్లారు దర్శకుడు ఆర్కే. ఈ చిత్రంలో ఆండీప్లవర్, క్యాలీఫ్లవర్ అనే రెండు పాత్రలు కనిపిస్తాను. కథ చెప్తున్నప్పుడు నాకేం అనిపించలేదు వాటి లుక్స్ బయటికొచ్చాక నాకే ఆశ్చర్యంగా అనిపించింది. కొద్దిమంది స్నేహితులు క్యాలీఫ్లవర్ అడ్డు పెట్టుకుని కనిపించే లుక్ చూసి ‘మరీ ఇలా చేశావేంది?” అన్నారు. వాళ్లు ఇంత సీరియస్‌గా తీసుకున్నారా అని అప్పుడు అనిపించింది ‘పీకే’లో ఆమిర్‌ఖాన్ రేడియో అడ్డుపెట్టుకుని కనిపిస్తారు. ఆ తర్వాత మళ్లీ అలా క్యాలీఫ్లవర్ అడ్డు పెట్టుకుని నటించింది నేనే అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అని అన్నారు సంపూర్ణేష్ బాబు.
నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయికి రావడం నా అదృష్టం పని అని ప్రస్తుతం తమిళ్ లో హీరోగా ఒక సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చారు సంపూర్ణేష్ బాబు.
Also Read: బన్నీ నుంచి క్రేజీ అనౌన్స్మెంట్.. తర్వాత సినిమా గురించేనా?