Rajamouli
Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లాజిక్కులతో సీన్లు రాసుకొని, మ్యాజిక్కులు చేస్తూ ప్రేక్షకుడిని థ్రిల్ కి గురి చేసే దర్శకుడు ఎవరైన ఉన్నారు అంటే అది సుకుమార్ అనే చెప్పాలి. ఈయన రాసిన ప్రతి సీన్, ప్రతి డైలాగు ప్రేక్షకుడి చేత చప్పట్లు కొట్టించేలా చేస్తాయి. ముఖ్యంగా లాజిక్స్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి సీన్ కి, ప్రతి క్యారెక్టర్ కి మధ్య లాజిక్స్ తో స్టోరీని నడిపిస్తూ ఉంటాడు.
ఇక ఇప్పటి వరకు ఈయన చేసిన ప్రతి సినిమాని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చిన్న లాజిక్ కూడా మిస్ అవ్వదు. అంత పకడ్బందీగా స్క్రిప్ట్ లు రాసుకొని సినిమాలు చేస్తాడు. కాబట్టే ఈయనను లెక్కల మాస్టారు అని కూడా పిలుస్తారు. ఇండస్ట్రీ కి రాక ముందు ఈయన మ్యాథ్స్ టీచర్ గా పని చేశాడు. అక్కడ లాజిక్ లతో ఎలాగైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడో, ఇక్కడ కూడా అలాగే లాజిక్స్ తో సీన్స్ రాసుకుంటూ సక్సెస్ లు కొడుతున్నాడు.
నిజానికి సుకుమార్ ఒక సినిమాని డీల్ చేస్తున్నాడు అంటే అందులో ఉన్న ప్లస్ లను, మైనస్ లను ముందుగా కనిపెట్టి దాన్ని హీరోకి ప్లస్ అయ్యే విధంగా కన్వర్ట్ చేస్తూ స్టోరీని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే సుకుమార్ ఆర్య 2 సినిమాలో ‘ఉప్పెనంత ఈ ప్రేమకి’ అనే సాంగ్ కు ముందు కొంతమంది రౌడీలను కొడతాడు. అప్పుడు తనకి కాజల్ ఐడి కార్డు కనిపించడంతో వాళ్ళని కొట్టడం ఆపేసి ఒక్కసారి తను ఇమాజిన్ లోకి వెళ్తాడు. అప్పుడు రౌడీలందరు గాల్లోకి ఎగురుతారు.
ఇక రాజమౌళి సునీల్ తో చేసిన ‘మర్యాద రామన్న’ సినిమాలో ఈ షార్ట్ ని అజ్ ఇట్ ఈజ్ గా కాపీ చేశాడు. మర్యాదరామన్న లో ‘నా కర్మ కాలిపోయింది’ అనే సాంగ్ లో సునీల్ రోడ్డుమీద అరుస్తూ ఉంటే ఒక్కసారిగా కార్లు గాల్లోకి ఎగురుతాయి. సుకుమార్ ఆర్య 2 లో రౌడీలు గాల్లో ఎగిరే షాట్ ను స్పూర్తిగా తీసుకొనే ఈ షాట్ ను నేను చేశానని స్వయంగా రాజమౌళి గారే చెప్పారు… మొత్తానికైతే దర్శకధీరుడు లెక్కల మాస్టర్ ను ఫాలో అయ్యాడు అని సుకుమార్ అభిమానులు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు…