Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: రాధేశ్యామ్​ ఫస్ట్ సింగిల్​ వచ్చేది అప్పుడే.. ప్రభాస్​ ఫ్యాన్స్​ పండగ!

Radhe Shyam: రాధేశ్యామ్​ ఫస్ట్ సింగిల్​ వచ్చేది అప్పుడే.. ప్రభాస్​ ఫ్యాన్స్​ పండగ!

Radhe Shyam: బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్​ ఇండియా సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​. సలార్​, ఆదిపురుష్​, రాధేశ్యామ్​ సినిమాలు చేస్తున్న ప్రభాస్​.. ఒక్క సినిమా నుంచి కూడా మంచి అప్​డేట్ ఇవ్వలేదని అభిమానులు బాధపడుతున్నారు. తమ హీరోను మల్లీ వెండి తెరపై చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, రాధే శ్యామ్ సినిమా నుంచి ఓ అప్​డేట్​ వచ్చింది. సాహో సినిమా తర్వాత రొమాంటిక్​ ఎంటర్​టైన్​మెంట్​ సినిమాగా రానున్న చిత్రం రాధేశ్యామ్​ నుంచి సరైన అప్​డేట్స్​ ఇవ్వడం లేదని ఇటీవలే ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్మాణ సంస్థ, మేకర్స్​పై కామెంట్ల వర్షం కురిపించారు. బ్యాన్​ యూవీ క్రియేషన్స్​ అంటూ హ్యాష్​ టాగ్​ చేస్తూ.. ట్రెండ్​ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

కాగా, ప్రభాస్​ ఫ్యాన్స్​ ఎమోషన్స్​తో ఆడుకోవద్దంటూ.. చిత్ర నిర్మాతలకు షాక్​ ఇచ్చే లెటర్​ను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. దీంతో తాజాగా రాధేశ్యామ్​ ట్విట్టర్​లో ట్రెండింలో నిలిస్తోంది. నవంబరు 15న రాధేశ్యామ్​ ఫస్ట్ సింగిల్​ వస్తుందని ప్రభాస్​ అభిమానులు రెడీగా ఉండాలంటూ నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఫస్ట్ సాంగ్​ లోడింగ్​ అంటూ ఓ పోస్టర్​ మాత్రం ప్రస్తుతం వైరల్​గా మారింది.

కాగా, ప్రస్తుతం ఆదిపురుష్​లో ప్రభాస్​ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా షూటింగ్​ పూర్తి చేసుకుంది. మరోవైపు సలార్​ సినిమాతోనూ ఫుల్​ బిజీగా ఉన్నారు ప్రభాస్​.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular