Prabhas: ఈశ్వర్ సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నటుడు ప్రభాస్… ఆ తర్వాత చేసిన వర్షం, చత్రపతి, డార్లింగ్, మిర్చి లాంటి సినిమాలు అతన్ని టాప్ హీరోగా మార్చాయి. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో చేసిన ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించే హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా పాన్ ఇండియాలో తనను మించిన హీరో మరొకరు లేరనెంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 3 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు అదే నెలలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ సైతం ‘కింగ్’ సినిమాను డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 2023 డిసెంబర్ నెలలోనే వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ప్రభాస్ సలార్ సినిమాతో వస్తే షారుక్ ఖాన్ డంకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అందులో డంకి సినిమా బోల్తా కొట్టగా, సలార్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. దాంతో ఇప్పుడు షారుక్ ఖాన్ మరోసారి ప్రభాస్ తో పోటీ పడే ప్రయత్నం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాంతో ఇప్పుడు కింగ్ సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసే అవకాశాలైతే ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ తో పోటి పడటం అనేది అంత ఆశా మాషీ వ్యవహారం కాదు. కొంచెం తేడా కొట్టిన కూడా అవతలి హీరో సినిమా గల్లంతైపోతుంది.
ప్రభాస్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతుంటాయి. ఇక దానికోసమే షారుక్ ఖాన్ సేఫ్ జోన్ లో ఉండడానికి డిసెంబర్ నెల నుంచి తన సినిమాను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…