
బబ్లీ గర్ల్ ‘రాశీ ఖన్నా’ పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా యూత్ ను ఆకట్టుకోవడానికి కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకు తగ్గట్లు అమ్మడు అందం కూడా అదుర్స్. అయితే అన్ని ఉన్నా… పాపం స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది ఈ బబ్లీ బ్యూటీ. ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ లోనే నిలిచిపోయింది. అందుకే, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి ఇప్పుడు గ్లామర్ డోస్ ను రోజురోజుకూ పెంచుకుంటూ పోతుంది.
Also Read: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బన్నీకి మరో సరికొత్త రికార్డ్ !
సోషల్ మీడియాలో ఈ మధ్య రాశీ ఖన్నా పోస్ట్ చేస్తోన్న ఫొటోలన్నీ ఎక్కువగా గ్లామరస్ గానే ఉంటున్నాయి. తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరి పూర్ణంగా ప్రదర్శిస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఏకంగా బికినీ ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లకు మంచి కిక్ ను ఇచ్చింది. ఎండాకాలం రాకముందే స్విమింగ్ డ్రెస్ వేసుకొని తన అందచందాలతో కనువిందు చేసింది. ఫిల్మ్ మేకర్స్ కూడా రాశీ ఖన్నా బోల్డ్ నెస్ ను చూసి మొత్తానికి షాక్ అవుతున్నారు.
Also Read: ఉగ్రరూపంలో విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ రిలీజ్ డేట్ ఇదే..
ప్రస్తుతం రాశీ తెలుగులో గోపీచంద్ సరసన నటించనుంది. అలాగే తమిళ్ లో ఒక సినిమా, మలయాళంలో మరో సినిమా, అదే విధంగా బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఇలా అన్ని భాషల్లో చేస్తోన్నా.. ఏ భాషలోనూ స్టార్ డమ్ ను సాధించలేకపోతుంది. గత రెండేళ్లుగా తెలుగులో రాశి ఖన్నాకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాకపోయే సరికి, ఇలా అందాలు ఆరబోయడంలో హద్దులు దాటుతుంది. ప్రస్తుతం రాశీ ఖన్నా, డైరెక్టర్స్ కీ ఫోన్ చేసి మరీ ఛాన్స్ ఇవ్వండి అంటూ అందరిని వేడుకుంటుందట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్