Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: The Rule  : అక్షరాలా 4 మిలియన్ డాలర్లు..నార్త్ అమెరికా లో ప్రభంజనం...

Pushpa 2: The Rule  : అక్షరాలా 4 మిలియన్ డాలర్లు..నార్త్ అమెరికా లో ప్రభంజనం సృష్టించబోతున్న ‘పుష్ప 2 :రూల్’

ఒకప్పుడు నార్త్ అమెరికా లో మూడు మిలియన్ డాలర్ల వసూళ్లు ఫుల్ రన్ లో వస్తే ఇండస్ట్రీ హిట్ గా పరిగణించేవాళ్ళు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు కేవలం ప్రీమియర్ షోస్ నుండి మన సినిమాలకు మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి.

Pushpa 2: The Rule  : మన టాలీవుడ్ కి అత్యంత పెద్ద మర్కెట్స్ లో ఒకటి ఓవర్సీస్. ‘దూకుడు’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాలు ఈ మార్కెట్ మన టాలీవుడ్ కి ఓపెన్ అయ్యింది. అప్పటి నుండి ప్రతీ సూపర్ హిట్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్ మార్కుని అవలీలగా దాటుతుండడం మనం చూస్తూనే ఉన్నాము. సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఇండియా నుండి నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, యూకే, దుబాయి వంటి దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దీంతో మన సినిమాలను చూసే వాళ్ళు కూడా అక్కడ ఎక్కువైపోయారు. ఒకప్పుడు నార్త్ అమెరికా లో మూడు మిలియన్ డాలర్ల వసూళ్లు ఫుల్ రన్ లో వస్తే ఇండస్ట్రీ హిట్ గా పరిగణించేవాళ్ళు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు కేవలం ప్రీమియర్ షోస్ నుండి మన సినిమాలకు మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి.

ఆ స్థాయిలో మన మార్కెట్ పెరిగింది. రీసెంట్ గా విడుదలను ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం, కేవలం ప్రీమియర్ షోస్ నుండి దాదాపుగా 3 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టింది. ప్రభాస్ కల్కి చిత్రం అయితే ఏకంగా 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ప్రీమియర్ షోస్ నుండి వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప చిత్రం ట్రెండ్ ని చూస్తూ ఉంటే, కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఈ సినిమా 4 నుండి 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పబోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా విడుదలకు సరిగ్గా 12 రోజుల సమయం ఉంది. ‘పుష్ప 2’ అప్పుడే 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని దాటేసింది. ఇది సాధారణమైన విషయం కాదు. ‘దేవర’, ‘కల్కి’ చిత్రాలకు కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేదు. ఒప్పు చూస్తుంటే ఈ సినిమా విడుదలయ్యే వారం రోజుల ముందు కనీవినీ ఎరుగని అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని ఆశిస్తున్నారు ట్రేడ్ పండితులు.

త్వరలోనే రిలీజ్ ట్రైలర్ ని కూడా వదలబోతున్నారట. ఈ ట్రైలర్ తర్వాత బుకింగ్స్ వేరే లెవెల్ కి వెళ్తుందని అంటున్నారు. అదే విధంగా రేపు అల్లు అర్జున్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కించిన ఐటెం సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. ‘కిసిక్’ అనే పాదంతో మొదలయ్యే ఈ పాటకి సంబంధించిన ప్రోమోని నేడు విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘పుష్ప 1’ లో ‘ఉ అంటావా మామ’ అనే పాట దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో మన కళ్లారా చూసాము. ఇప్పుడు ‘కిసిక్’ అనే పాట కూడా అదే రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఈ పాట కూడా ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కి మరింత బూస్ట్ ని ఇవ్వనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper