Homeఎంటర్టైన్మెంట్Rajamouli Prasanth Varma: రాజమౌళి బాటలోనే నడుస్తున్న ప్రశాంత్ వర్మ...సక్సెస్ అవుతాడా..?

Rajamouli Prasanth Varma: రాజమౌళి బాటలోనే నడుస్తున్న ప్రశాంత్ వర్మ…సక్సెస్ అవుతాడా..?

Rajamouli Prasanth Varma: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన దర్శకుడు రాజమౌళి… ఆయన అప్పట్నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడలేదు. డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాడు. దానివల్లే రాజమౌళి అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచి గౌరవమైతే ఉంది. ఇక తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఆయన ఒకప్పుడు మాస్ సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ […]

Rajamouli Prasanth Varma: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన దర్శకుడు రాజమౌళి… ఆయన అప్పట్నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడలేదు. డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాడు. దానివల్లే రాజమౌళి అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచి గౌరవమైతే ఉంది. ఇక తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఆయన ఒకప్పుడు మాస్ సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలను అందించాలనే ఉద్దేశ్యంతో గ్రాఫిక్స్ వైపు అడుగులు వేస్తూ భారీ విజువల్ వండర్స్ ని తెరకెక్కించే ప్రయత్నంలో బిజీగా ఉంటున్నాడు. ఇక తన బాటలోనే యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. హనుమాన్ సినిమాతో ఒక భారీ విజువల్ వండర్స్ ను క్రియేట్ చేసిన ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా కూడా పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ ఇప్పటికైనా తొందరగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయగలిగితే తను కూడా స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడు.

లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో దర్శకులు ఎవరికి వాళ్లు గొప్ప కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా విజువల్ వండర్స్ కి ఎప్పటికి ఆదరణ దక్కుతుంది.

అందువల్లే టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ప్రశాంత్ వర్మ మరోసారి రాజమౌళి బాటలోనే నడుస్తూ రాజమౌళి అంత ఎత్తుకు ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి… ఇక మరి కొంతమంది ప్రశాంత్ వర్మ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి అతను సినిమాల మీద డైరెక్షన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper