Prasanth Varma vs Producers: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో యంగ్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతోంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హనుమాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం కొన్ని సినిమాలను అనౌన్స్ చేశాడు. తను దర్శకుడిగా సినిమాలు చేస్తూనే కొన్ని కథలను రాసుకొని తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రొడక్షన్ హౌజ్ ను కూడా స్టార్ట్ చేస్తున్నాడు. హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత చాలా ప్రొడక్షన్ హౌస్ ల నుంచి అతనికి అడ్వాన్సులైతే అందాయి. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్, సుధాకర్ చెరుకూరి, నిరంజన్ రెడ్డి, హోం బలే పిక్చర్స్ వారి దగ్గర నుంచి కూడా అడ్వాన్సులైతే తీసుకున్నాడు. ఇక వీళ్ళందరు ప్రశాంత్ వర్మ ని మన సినిమా ఎప్పుడు అని అడిగిన ప్రతి సారి తమ తదుపరి సినిమా మీకే అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు.
కానీ ఇప్పటివరకు ఏ సినిమాని కూడా స్టార్ట్ చేయలేదు. కొత్త ప్రొడ్యూసర్స్ దగ్గరి నుంచి కూడా చాలా వరకు అడ్వాన్స్ ల రూపంలో తీసుకున్నాడు. ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఎవరితో ఎలాంటి సినిమాలు చేసిన కూడా మరొక ప్రొడ్యూసర్ ఆగిపోవాల్సిన అవసరమైతే ఉంది.
Also Read: ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ వివాదం.. డీవీవీ దానయ్య సంచలన ప్రకటన..
ఇక ఇప్పటికిప్పుడు ఆయన కొన్ని సినిమాలు చేసిన కూడా వీళ్ళందరికి న్యాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి అతని మీద ప్రొడక్షన్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్సులన్ని కలిపి 100 కోట్ల వరకు అవుతాయని దాంతో అతను హైదరాబాద్ లో ఒక ప్లేస్ ని కొని అక్కడ ఒక పెద్ద భవనాన్ని నిర్మించాడు.
ఇక ప్రొడ్యూసర్స్ అందరు వాళ్లిచ్చిన అడ్వాన్స్ లను తిరిగి చెల్లించాలని అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రశాంత్ వర్మ ఆ డబ్బులను చెల్లించగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది…