Prasanth Varma: ఈ సంవత్సరం వచ్చిన హనుమాన్ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలను చేయడంలో ఆయనను మించిన వారు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక యంగ్ డైరెక్టర్ గా ముందుకు దూసుకెళ్తున్న ఈయన ప్రస్తుతం ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి ఈయన ప్రభాస్ తో సినిమా చేయడానికి కన్నడలో నిర్మిస్తున్న హోం బలే పిక్చర్స్ వారు వీళ్ళ కాంబినేషన్ ను సెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ లాంటి నటుడు సినిమాలను చేయాలని కోరుకుంటున్నాడు తద్వారా ఆయన ఎలా కనిపించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో ఆయన చేయబోయే సినిమా సూపర్ మ్యాన్ కి సంబంధించిన ఒక సినిమాగా తెలుస్తోంది. ఇక దానికి అనుగుణంగానే ఆయన ఒక మంచి కథను కూడా రెడీ చేసుకున్నారట. ప్రశాంత్ వర్మ సినిమాలంటే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాని కూడా అదే రేంజ్ లో తెరకెక్కించి భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు తెర మీదికి వస్తుంది అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. కానీ వీళ్ళ కాంబినేషన్ లో మాత్రం పక్కాగా ఒక సినిమా ఉండబోతుంది అంటూ ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా ప్రభాస్ లాంటి నటుడు ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక వరుస సినిమాలతో ఆయన ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉందని ట్రేడ్ పండితులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక రాబోయే సినిమాలతో కూడా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా ప్రభాస్ బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది…