Prasanth Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు సైతం హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందంటూ అనౌన్స్ చేసిన ఆయన ఆ సినిమాకు సంబంధించిన పనులను ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. ఇక హనుమంతుడిగా రిషబ్ శెట్టి నటిస్తున్నాడు అంటూ ఆయనకు సంబంధించిన ఒక పిక్ ని తీసి ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేశాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. ఇక దానికి తోడుగా బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ చేయాల్సిన సినిమాని కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి ఈ రెండు సినిమాలను ఆయన ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనే విషయంలోనే ఇప్పుడు సరైన క్లారిటీ అయితే రావడం లేదు. హనుమాన్ సినిమా వచ్చి దాదాపు సంవత్సరన్నర అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆయన నుంచి మరొక సినిమా అయితే రాలేదు. ఇక స్టోరీల మీద స్టోరీలు ఇతర హీరోలకు చెబుతున్నప్పటికి ఆయన ఒక స్టోరీ మీద ఫిక్స్ అయి సినిమా చేయడం లేదు.
Also Read: తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి!
జై హనుమాన్ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనేదాని మీద సోషల్ మీడియా లో విపరీతమైన చర్చ నడుస్తోంది…ఈ సినిమా మీద ఒకప్పుడు మంచి బజ్ అయితే ఉండేది. ఇక రోజు రోజుకి సినిమా మీద ప్రేక్షకుల్లో క్రేజ్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే కలుగుతుంది.
మరి ప్రశాంత్ వర్మ ఎందుకని ఇలా చేస్తున్నాడు ఒక సినిమా మీద బజ్ ఉంటే ఆ సినిమాని పూర్తిగా ఫినిష్ చేస్తేనే బాగుంటుంది అలా కాకుండా సినిమాను హోల్డ్ లో పెడితే దానిమీద ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అయిపోయి ఆ సినిమాను పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.
కాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమాని తొందరగా స్టార్ట్ చేసి ఫినిష్ చేయాలని ప్రశాంత్ వర్మ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…