Prabhas Formhouse : ప్రభాస్ ఆస్తుల విషయంలో నేషనల్ మీడియా రాసిన ఒక వార్త దుమారం రేపుతోంది. కనీస కామన్ సెన్స్ లేకుండా నిరాధార కథనాలు ఎలా రాస్తారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అదే సమయంలో సదరు మీడియా సంస్థను ట్రోల్ చేస్తున్నారు. దేశంలోనే నంబర్ వన్ మీడియాగా పేరున్న సంస్థ ఇలాంటి వార్త రాయడంతో ప్రముఖులు సైతం నివ్వెరపోతున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ… సదరు సంస్థ రాసిన ఆర్టికల్ ని ట్యాగ్ చేసి ఏకిపారేశారు. ఇంతటి పేరున్న మీడియా సంస్థ నుండి ఇలాంటి రాతలు ఊహించలేదని, తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

హీరో ప్రభాస్ కి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు ఉంది. అది 84 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని విలువ రూ. 60 కోట్లు, అంటూ ఒక మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ న్యూస్ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ దృష్టికి వెళ్ళింది. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజంగా మీరేనా ఈ న్యూస్ రాసింది?.. జూబ్లీహిల్స్ లో 84 ఎకరాల స్థలం విలువ ఎంత ఉంటుందో మీకు కనీస అవగాహన ఉందా!. మీ రిపోర్టర్స్ ఒక సెలబ్రిటీని ఉద్దేశించి ఎలాంటి చెత్త న్యూస్ అయినా రాసి పబ్లిష్ చేస్తారా. అసలు ఒకే సెంటెన్స్ లో లావిష్ , సింపుల్ అనే పదాలు వాడటం ఏమిటో.. అని కామెంట్ చేశాడు. తన ట్వీట్ కి ఆ సంస్థను ట్యాగ్ చేశారు.
సెంటు నేల కోట్లు పలికే ఏరియాలో ప్రభాస్ కి 84 ఎకరాల స్థలం ఉందని , దాని విలువ రూ. 60 కోట్లని రాసిన రిపోర్టర్ పై, ప్రచురించిన సంస్థపై శోభు సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక శోభు ట్వీట్ కి ప్రభాస్ ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఇది కొందరు వ్యక్తులు కావాలని ప్రభాస్ పై చేస్తున్న దుష్ప్రచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ప్రముఖ సంస్థ పరువును మాత్రం శోభు నిలువునా తీసేశాడు.
అసలు ఏమాత్రం పొంతలేని న్యూస్ రాసిన ఆ రిపోర్టర్ ఎవరు అనే చర్చ గట్టిగా నడుస్తుంది. ప్రభాస్ ఆస్తులు, లగ్జరీ కార్లు, సంపాదన గురించి గతంలో కూడా ఇలాంటి నిరాధార కథనాలు అనేకం తెరపైకి వచ్చాయి. అందరికీ తెలిసిన విషయాన్ని రాసి సదరు రిపోర్టర్ దొరికిపోయాడు. మరోవైపు ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఆదిపురుష్ వాయిదా పడింది. దర్శకుడు మారుతీతో చేస్తున్న మూవీ రెగ్యులర్ షూట్ సైతం త్వరలో ప్రారంభం కానుంది అంటున్నారు.
https://twitter.com/Shobu_/status/1598289619682197504?s=20&t=zrP1zu_Sj4hQWtgE0wby9Q
