Homeఎంటర్టైన్మెంట్Fauzi Movie Glimpse: గూస్ బంప్స్ రప్పిస్తున్న 'ఫౌజీ' గ్లింప్స్.. ప్రభాస్ మాస్ విశ్వరూపం!

Fauzi Movie Glimpse: గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘ఫౌజీ’ గ్లింప్స్.. ప్రభాస్ మాస్ విశ్వరూపం!

Fauzi Movie Glimpse: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు కానీ , షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో వచ్చే ఏడాది కి వాయిదా వేశారు. కానీ ఈ సినిమా ఎప్పుడు విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ కురుస్తుందని నేడు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో తో […]

Fauzi Movie Glimpse: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు కానీ , షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో వచ్చే ఏడాది కి వాయిదా వేశారు. కానీ ఈ సినిమా ఎప్పుడు విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ కురుస్తుందని నేడు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో తో ఒక క్లారిటీ వచ్చేసింది. నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు ఈ సినిమా గ్లింప్స్ ని విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ కొన్ని టెక్నీకల్ ఎర్రర్స్ రావడం తో కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ని చూసిన తర్వాత అందరిలో కలిగే ఫీలింగ్ ఒక్కటే , కచ్చితంగా ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అని.

హను రాఘవపూడి అంటే చాలా సాఫ్ట్ డైరెక్టర్ , ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ మాత్రమే తీసాడు, ఈయన ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ హీరో ని ఎలా డీల్ చేస్తాడో అనే భయం అభిమానుల్లో ఉండేది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది , హైప్ కూడా క్రియేట్ అయ్యింది కానీ , ప్రభాస్ భవిష్యత్తులో చేయబోయే సినిమాలతో పోల్చి , ఈ చిత్రాన్ని చాలా తక్కువ చేస్తూ వచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్. కానీ నేడు విడుదల చేసిన గ్లింప్స్ తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. మన దేశానికీ స్వతంత్రం రాకముందు జరిగిన స్టోరీ ఇది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం లో ప్రభాస్ మన దేశం కోసం ఎలాంటి పోరాటం చేసాడు అనేదే ఈ సినిమా స్టోరీ గా గ్లింప్స్ ని చూస్తే అర్థం అవుతోంది.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అలాంటి బలమైన స్టోరీ తో ఈసారి మన ముందుకు రాబోతున్నట్టు అర్థం అవుతోంది. ముఖ్యంగా గ్లింప్స్ లోని చివరి షాట్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ప్రభాస్ లుక్స్ కూడా ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే చాలా బాగున్నయి. ఈ సినిమాలో దేశభక్తి తో పాటు , హృదయాలను పిండేసే అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉందట. అది ప్రస్తుతానికి దాచి పెట్టారు మేకర్స్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హాలీవుడ్ సినిమా తరహాలో ఉన్నాయి , మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper