Prabhas Assets: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. బాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరోకు తను పోటీని ఇస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… సలార్, కల్కి లాంటి సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బాస్టర్లను సాధించిన ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ఆస్తుల విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రభాస్ కి 5000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీ రాజుల ఫ్యామిలీ… కాబట్టి మొదటి నుంచి కూడా వాళ్లకు చాలా ఆస్తులైతే ఉన్నాయి.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
ఇక దానికి తగ్గట్టుగా ప్రభాస్ హీరోగా మారిన తర్వాత కూడా చాలా వరకు తన రెమ్యూనరేషన్ ని బిజినెస్ ల రూపంలోకి మార్చి దాని ద్వారా కూడా ఆయన విపరీతంగా లాభాలను అర్జీస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఆయన ఆస్తులు 5000 కోట్లుగా ఉన్నప్పటికి అవి ఫ్యూచర్ లో భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే ఆయన ఒక సినిమా కోసమే దాదాపు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక దాంతో పాటు బిజినెస్ లలో కూడా అతనికి భారీగా వాటాలు ఉండడంతో దానిద్వారా కూడా భారీగానే లాభాలైతే వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి.
ఇక మొత్తానికైతే ఇప్పటికే 5000 కోట్లకు ఆస్తిపరుడుగా ఉన్న ప్రభాస్ ఫ్యూచర్లో పదివేల కోట్ల వరకు ఆస్తిని సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమా పూర్తి అయ్యాక స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు…