Rice: నేటి కాలంలో సరైన ఆహారం తినడం కష్టంగా మారింది. వాతావరణ కలుషితం.. కల్తీ ఆహార పదార్థాలు ఉండడం వల్ల మానవ శరీర ఆరోగ్యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొత్త వ్యాధులు శరీరానికి వచ్చి సరైన ఆహారం తినకుండా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువమంది బాధపడేది మధుమేహంతోనే. వయసుతో సంబంధం లేకుండా డయాబెటిక్ బారిన పడుతున్నారు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు వరి అన్నం తినడం వల్ల సమస్యలు వస్తాయని కొందరు చెబుతూ ఉంటారు. దీంతో చాలామంది సాయంత్రం సమయంలో వారి అన్నం తినడం మానేశారు. అసలు మరి అన్నం తినడం వల్ల షుగర్ లెవెల్స్ నిజంగానే పెరుగుతాయా?
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
ఒకప్పటికి ఇప్పటికీ వాతావరణం చాలా మారిపోయింది. పూర్వకాలంలో పెద్దలు మూడు పూటలా వరి అన్నం మాత్రమే తినేవారు. అయితే వారికి ఎలాంటి అనారోగ్యాలు ఉండేవి కావు. అందుకు కారణం వారు చేసే శారీరక శ్రమ అనుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది శారీరక శ్రమ చేయడం లేదు. ఒకే చోట కూర్చోవడం.. వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇదే సమయంలో ఇంట్లో వండిన ఆహారానికి బదులు బయట దొరికే చిరుతిళ్లు, జంక్ ఫుడ్, రోస్టెడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా క్రమంగా డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే డయాబెటిక్ వ్యాధి మారిన పడినవారు వరి అన్నంను తక్కువగా తీసుకోవాలంటారు. ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.
వాస్తవానికి డయాబెటిక్ పెరగడానికి వరి అన్నం కానే కాదు అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కేవలం వరి అన్నం తినడం వల్లనే షుగర్ రాదని.. కొన్ని ఆరోగ్య ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కూడా డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారని అంటున్నారు. శారీరక శ్రమ చేయకపోవడంతో పాటు.. క్రమ పద్ధతిలో ఆహారాన్ని తీసుకోకపోవడం.. హోటల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం.. ఎక్కువసేపు కూర్చోవడం వంటివి చేయడం వల్ల కూడా షుగర్ వ్యాధి భారిన పడుతున్నారు.
మనదేశంలో దాదాపు 50 శాతం మంది వరి అన్నం పైనే ఆధారపడుతున్నారు. అయితే ఒక్కసారిగా డయాబెటిక్ కారణంగా వరి అన్నం ను దూరం పెడితే అలసట వస్తుంది. అంతేకాకుండా అన్నం స్థానాన్ని కొన్ని ఆహార పదార్థాలు భర్తీ చేయలేవు. అయితే మరి అన్నం ను క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. గ్లైసోమిక్ ఎక్కువగా ఉండే కొన్ని వరి బియ్యం ద్వారా వండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అంటే బ్రౌన్ రైస్ లేదా తక్కువ షుగర్ కంటెంట్ కలిగిన బియ్యంతో వండిన ఆహారంలో తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అంతేకాకుండా వరి అన్నంలో తగిన మోతాదులో కూరలు కూడా ఉండాలని చెబుతున్నారు. అంటే ఇందులో ఆకుకూరలు, నెయ్యి, ఇతర ఆహార పదార్థాలను కలుపుకొని తినడం వల్ల వరి అన్నం ప్రభావం శరీరంపై పడదని చెబుతున్నారు. అంతేకాకుండా వరి అన్నంలో తక్కువ మోతాదులో మూడుపూటలా తీసుకుంటూ.. వ్యాయామం చేయడం వల్ల కూడా మరి అన్నం ప్రభావము ఉండదని అంటున్నారు.