Prabhas Wedding: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. నిజానికి ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అందువల్లే ఆయన ఎక్కువ రోజులపాటు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నాడు. సలార్, కల్కి లాంటి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు రాబోతున్న ‘రాజాసాబ్’ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
ఈ సినిమాతో కనుక సక్సెస్ ని సాధిస్తే హ్యాట్రిక్ విజయాలను సాధించిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు… ఇక తన సినిమా కెరియర్ అనేది టాప్ లెవెల్లో దూసుకుపోతున్నప్పటికి తన పర్సనల్ విషయాల్లోనే ఆయన అభిమానులు చాలావరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ప్రభాస్ 45 సంవత్సరాలు వచ్చినప్పటికి ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు.
కారణం ఏంటి అంటే ఆయన హీరోగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నా కెరియర్ స్టార్టింగ్ లోనే తనతో నటించిన ఒక స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. కానీ ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణంరాజు, పెద్దమ్మ అయిన శారదా దేవి ఇద్దరు ఆ అమ్మాయి మనకు సరైన అమ్మాయి కాదని హీరోయిన్ గా సినిమాలు చేసే వాళ్ళు మనకు పనికిరారని చెప్పారట.
అలాగే వీళ్ళు కాకుండా బయట ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోమని చెప్పడంతో ప్రభాస్ వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు. ఇక ప్రస్తుతానికైతే ఆయన ఎవరిని కూడా పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి అయితే రావడం లేదట…ఇక ఇప్పటికే ఏజ్ పెరిగిపోతున్న కూడా ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఇక మీద పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…