యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈమూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ యూరప్‌లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ ఓ ఛేజింగ్ సీన్ చేసినట్లు సమాచారం. తాజా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
ప్రభాస్ 20వ మూవీ ఫస్ట్ లుక్‌ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు పోస్టర్స్‌ను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటోంది. గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 2020 దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.
ఈ మూవీ పూర్తికాగానే ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రకటనను దర్శకుడు అనౌన్స్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించనున్నారు. సైంటిఫిక్ కథాంశంతో ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నాడు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Prabhas 20s first look to be released on ugadi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com