Rats Steal Gold Rings: శీర్షిక చదివారు కదా.. ఇప్పటికే మీకు మేటర్ అర్థమై ఉంటుంది.. ఆ దొంగ బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉంది.. అందువల్లే పోలీసులు పట్టుకోలేకపోయారు.. అని అనుకుంటున్నారు కదా.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే..
అది కర్ణాటక రాష్ట్రం.. తుమకూరు ప్రాంతం .. అక్కడ ఒక గోల్డ్ షాప్ ఉంది. ఆ షాప్ లో దొంగతనం జరిగింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ముందుగా ఎందుకైనా మంచిదని సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో బంగారపు ఉంగరాలను దొంగలు ఎత్తుకెళ్ళడం కనిపించింది. దీంతో ఆ షాప్ నిర్వాహకులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులకు చెప్పినప్పటికీ వారు ఆ దొంగలను అరెస్ట్ చేయలేకపోయారు.
ఇక్కడ ఆ బంగారం షాపులో బంగారు ఉంగరాలను దొంగతనం చేసింది పేరు మోసిన గజదొంగలు కాదు. వారికి ఎటువంటి నేరచరిత్ర లేదు. ఆ మాటకొస్తే దొంగతనం చేసింది మనుషులు కూడా కాదు.. జంతువులు.. అ జంతువులు ఎలుకలు.. ఆ జువెలరీ షాప్ పక్కన నిర్మానుష్య ప్రాంతం ఉంది. అక్కడ ఎలుకలు స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి. జ్యువెలరీ షాప్ నిర్వాకులు షాప్ క్లోజ్ చేయగానే ఎలుకలు అందులోకి ప్రవేశించేవి. బంగారు ఉంగరాలను నోట కరుచుకొని వెళ్లేవి. బొరియలలో వాటిని ఉంచేవి. సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు చూసిన తర్వాత జ్యువెలరీ షాప్ నిర్వాహకులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. జరిగిన విషయాన్ని పోలీసులు చెప్పారు. పోలీసులు ఎలుకలను అరెస్ట్ చేయలేరు కాబట్టి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఎలుకల బొరియలలో పోలీసులు పరిశీలన జరిపారు. 10 ఉంగరాలు.. మూడు గొలుసులు కనిపించడంతో.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు పది లక్షల వరకు ఉంటుందని సమాచారం. వాస్తవానికి ఎలుకలు తినే వస్తువులను ఎత్తుకెళ్తాయి. ఒకవేళ కాపీలు లేదా పుస్తకాలు ఉంటే కొరికివేస్తాయి. అలాకాకుండా బంగారపు వస్తువులను తీసుకెళ్లడం.. వాటిని దాచుకోవడం ఆశ్చర్యంగా ఉంది.. ఇంతకీ తినే వస్తువులు అనుకుని ఆ ఎలుకలు ఆ బంగారపు ఉంగరాలను ఎత్తుకెళ్లి ఉంటాయని గోల్డ్ షాప్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత గోల్డ్ షాపు నిర్వాహకులు ఎలుకలు రాకుండా చర్యలు తీసుకున్నారు. కన్నాలను కాంక్రీట్ మిశ్రమంతో ఎక్కడికక్కడ మూసేశారు.
A rat pulled off a ~$12,000 worth jewellery heist at Vishwas Jewellers in INDIA. The furry thief dragged diamond-studded gold rings and chains into its burrow like a pro.
CCTV caught the entire crime spree. Staff dug up the hole and recovered all 10 rings + 2 chains. Case… pic.twitter.com/SXhwKNbcOx
— Viral (@Viralxthings) July 30, 2026