Posani Krishna Murali : ప్రముఖ నటుడు, వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) ని కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇటీవలే తెలుగు దేశం పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వగా, పోలీసులు హైదరాబాద్ లో ఉంటున్న పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అధికార గర్వంతో, మరో మూడు దశాబ్దాలు తామే ప్రభుత్వం లో ఉంటాము అనే ధీమాతో పోసాని లాంటోళ్ళు గత ఐదేళ్లు ఏ రేంజ్ లో రెచ్చిపోయి, హద్దులు దాటి మాట్లాడారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడిన మాటలు వింటే సభ్య సమాజం సిగ్గు పడుతుంది. అసలు ఇలాంటి మనుషులు బ్రతకడానికి కూడా అర్హులు కారు అంటూ అనేక మంది అభిప్రాయపడ్డారు. ఇతనికి శిక్ష ఎప్పుడు పడుతుందా అని ఆతృతగా ఎదురు చూసారు.
ఎట్టకేలకు ఆయనకు శిక్ష పడడంతో అందరూ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), లోకేష్(Nara Lokesh), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లపై గతంలో పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా చిర్రెత్తక తప్పదు. కానీ మాజీ సీఎం జగన్ ఇతనికి ఇప్పటికీ అండగా ఉండడం, ఇలాంటోళ్లను అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. రైల్వే కోడూరు కోర్టు పోసానికి 15 రోజుల పాటు రిమాండ్ ని విధించారు. ఈ రిమాండ్ లో పోసాని చెప్పిన కొన్ని నిజాలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులను ఇబ్బందికి గురి చేసేలా ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ ‘సజ్జల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం గానే, తానూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : అంతా సజ్జలే.. తేల్చేసిన పోసాని.. రిమాండ్ రిపోర్టులో సంచలనాలు!
ఇలా మాట్లాడితే సమస్య అవుతుందేమో అని అప్పట్లో నేను భయపడ్డానని, కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి బలవంతం చేయడంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని, నేను మాట్లాడే మాటలను సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ సోషల్ మీడియా లో షేర్ చేయించి విస్తృతంగా వ్యాప్తి చెందేలా చేసాడని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చాడు. అంతకు ముందు పోలీసులు పోసాని గతంలో మాట్లాడిన మాటలన్నీ వీడియోలు వేసి వరుసగా చూపించారు. దానికి పోసాని కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయట, తప్పు అయిపోయింది, అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించండి అంటూ చెప్పుకొచ్చాడట. ఇది ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ గా మారింది . టీడీపీ, జనసేన శ్రేణులు మాత్రం క్షమాపణలు చెప్పినా అతన్ని వదిలి పెట్టకండి అని, చిన్న ఆడపిల్లలపై కూడా చాలా నీచమైన కామెంట్స్ చేసిన పోసాని క్షమ కి అర్హుడు కాదని అంటున్నారు.
Also Read : పోసాని కృష్ణ మురళి కి బెయిల్ విషయంపై సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు..ఇది మామూలు ట్విస్ట్ కాదు!