Ram Charan and NTR : ఆర్ ఆర్ ఆర్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీ. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 ఆగస్టులో విడుదల కానుంది. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న మరో మల్టీస్టారర్ వార్ 2. అలాగే ఎన్టీఆర్ కి ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ మూవీ. ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ దేవర చేశాడు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ఫేమ్ కారణంగా వసూళ్లు మాత్రం రాబట్టింది.
త్వరలో ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు. మరి దేవర 2 ఉంటుందా లేదా అనేది సందేహమే. కాగా ఎన్టీఆర్ దేవర స్థానంలో బుచ్చిబాబు మూవీ చేయాల్సింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఒక కథ రాశాడు. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో ఎన్టీఆర్ తో బుచ్చిబాబుకు అనుబంధం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ కి ఒక కథ నెరేట్ చేశాడు. బుచ్చిబాబు-ఎన్టీఆర్ మూవీ దాదాపు ఖాయమే, పెద్ది టైటిల్ అంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ మిత్రుడు రామ్ చరణ్ కి సూచించాడు. బుచ్చిబాబు కథ నీకు సెట్ అవుతుంది, వినమని రికమెండ్ కూడా చేశాడని సమాచారం.
Also Read : ఎన్టీఆర్ భార్య ప్రణీత కి బాగా ఇష్టమైన రామ్ చరణ్ సినిమా అదేనా..? ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసిందంటే!
రామ్ చరణ్ ఓకే చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలైంది. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా అని టాలీవుడ్ టాక్. ఈ సినిమా పై పాజిటివ్ బజ్ ఉంది. తన శిష్యుడు బుచ్చిబాబు టాలెంట్ పై నమ్మకం ఉన్న సుకుమార్ సైతం నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. బుచ్చిబాబు-రామ్ చరణ్ మూవీ హిట్ అయితే ఎన్టీఆర్ ఒకింత బాధపడక తప్పదు. బుచ్చిబాబు కథను రామ్ చరణ్ కి అప్పగించి, దేవర చేయడం రాంగ్ ఛాయిస్ అన్నట్లు అవుతుంది.
కారణం దేవర పూర్తి స్థాయిలో మెప్పించలేదు. చరణ్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టిన నేపథ్యంలో కొరటాల కంటే బుచ్చిబాబు బెస్ట్ అవుతాడు. ఎన్టీఆర్ మంచి కథను రామ్ చరణ్ కి వదిలేసి, కొరటాల వెంటపడ్డాడని అభిమానులు అసహనం వ్యక్తం చేయవచ్చు. కాగా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబు స్టార్ హీరోతోనే మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు ఏళ్ల తరబడి ఎదురుచూశాడు. తనపై నమ్మకంతో ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్ కి బుచ్చిబాబు ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి..
Also Read : ఆ సమయం లో ఎన్టీయార్ ను చూసి రామ్ చరణ్ జలసి గా ఫీల్ అయ్యాడా..?