Pooja Hegde : పూజా హెగ్డే కెరీర్ నెమ్మదించింది. ఒకప్పటి ఈ లక్కీ హీరోయిన్ ఐరన్ లెగ్ లా మారిపోయింది. పూజా హెగ్డే సినిమాలో ఉందంటే అది మటాష్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్లాప్స్ ఇచ్చింది. రాధే శ్యామ్ మూవీతో మొదలైన ఆమె డౌన్ ఫాల్ కొనసాగుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం తర్వాత పూజా హెగ్డేకి హిట్ లేదు. రాధే శ్యామ్ ఆమెకు భారీ హిట్ ఇస్తుంది అనుకుంటే డిజాస్టర్ ఇచ్చింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్ నిరాశపరిచింది.
అనంతరం నటించిన ఆచార్య మరో డిజాస్టర్. చిరంజీవి, రామ్ చరణ్ లకు ఆచార్య చేదు అనుభవం మిగిల్చింది. అలాగే బీస్ట్, హిందీ మూవీ సర్కస్, స్పెషల్ ఐటెం సాంగ్ చేసిన ఎఫ్ 3 వరుసగా అటకెక్కాయి. ఇక లేటెస్ట్ రిలీజ్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ప్లాప్ లిస్ట్ లో చేరింది. సల్మాన్ సైతం పూజా హెగ్డేను కాపాడలేకపోయారు. రంజాన్ కానుకగా విడుదలైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పండగను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. సల్మాన్ మూవీతో పూజా హెగ్డే వరుస ఆరు ప్లాప్స్ ఇచ్చినట్లు అయ్యింది.
ఆమె ఆశలన్నీ గుంటూరు కారం చిత్రం మీదే. మహేష్ బాబు-త్రివిక్రమ్ ఆమెకు కలిసొచ్చిన కాంబినేషన్. మహేష్ ఆమెకు మహర్షి రూపంలో హిట్ ఇచ్చాడు. ఇక త్రివిక్రమ్ ఆమె దశ మార్చేశాడు. కేవలం త్రివిక్రమ్ కారణంగానే పూజా స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చింది. ఆయన దర్శకత్వంలో పూజా నటించిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో భారీ విజయాలు సాధించాయి. 2020 సంక్రాంతి విన్నర్ అల వైకుంఠపురంలో ఆమె కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది.
కాబట్టి గుంటూరు కారం విజయం సాధిస్తుందని పూజా హెగ్డే గట్టి విశ్వాసంతో ఉన్నారు. గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కెరీర్ సంగతి అలా ఉంటే… పూజా హెగ్డే హాట్ సెల్ఫీతో సెగలు పుట్టిస్తోంది. తాజాగా టోర్న్ జీన్స్, ఎల్లో టీ షర్ట్ ధరించి నాటీ లుక్ షేర్ చేసింది. పూజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.