Pooja Hegde: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే(Pooja Hegde). ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా స్టార్ హీరోల సరసన నటించిన పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈమధ్య కాలం లో పూజా హెగ్డే చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. ‘అలా వైకుంఠపురంలో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ హాట్ బ్యూటీ కి అసలు ఏది కలిసి రావడం లేదు. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్, దేవా, రెట్రో ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అవకాశాల మీద అవకాశాలు వస్తూనే ఉన్నాయి, ఆమె అందం అలాంటిది మరీ.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా
రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం లో ఈమె చేసిన ‘మౌనికా’ అనే స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యింది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విధంగా ఆ సినిమా పై ఈ రేంజ్ హైప్ పెరగడానికి ఒక కారణం గా కూడా మారింది. పూజా హెగ్డే వేసిన స్టెప్పులకు కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయారు. రేపు థియేటర్స్ లో ఏమైపోతారో చూడాలి. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు ప్రభాస్(Rebel Star Prabhas) తో పని చేయడం మర్చిపోలేని అనుభూతి అని, ఆయనతో కలిసి సినిమా చెయ్యాలని ఉందని, అందుకోసం ఎంతకైనా తెగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
గతం లో వీళ్లిద్దరు కలిసి ‘రాధే శ్యామ్’ అనే చిత్రం లో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రం చాలా బాగా నచ్చింది. అంతే కాదు ప్రభాస్, పూజా హెగ్డే జంటకి కూడా మంచి మార్కులు పడ్డాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాన్స్ , కెమిస్ట్రీ వంటివి కూడా బాగా పండాయి. అందుకే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ‘జన నాయగన్’, ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘కాంచన 4’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగు లో కూడా ఒక పెద్ద సినిమాకు సంతకం చేసిందట కానీ, వివరాలు మాత్రం చెప్పడం లేదు.