Satyasai Srinivas: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు గొప్ప నటులుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే డిఫరెంట్ తరహాలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటులు ఎంతమంది ఉన్నా కూడా కొత్తగా మరికొంత మంది నటులు వాళ్ళను వాళ్ళు.గొప్ప నటులుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘సత్యసాయి శ్రీనివాస్’ అనే నటుడు ఈ మధ్యకాలంలో గొప్ప పాత్రలను పోషిస్తున్నాడు. గతంలో ఆయన డిప్యూటీ కలెక్టర్ గా కూడా జాబ్ చేశాడు. అయినప్పటికి ఆయనకి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆ జాబ్ ని వదులుకొని ఇండస్ట్రీకి వచ్చి తన టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నానని చెప్పాడు.
ప్రస్తుతానికైతే లైఫ్ హాయిగా ఉందని తను జాబ్ వదిలేసినందుకు తనకు రిగ్రేట్ గా ఏమీ లేదని తను ఏదైతే ప్యాషన్ గా పెట్టుకొని ఉండేవాడో అలాంటి నటుడిగా ఎదిగినందుకు చాలా సంతృప్తికరంగా ఉందని ఆయన పలు రకాల కామెంట్లను చేస్తుండడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా సత్యసాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికీ తను అదే జాబ్ లో కంటిన్యూ అయితే నెలకు రెండు లక్షల రూపాయల శాలరీ మాత్రమే తీసుకునేవాడినని ఇంకా ఎక్కువ సంపాదించడానికి కరప్షన్ చేయాల్సి వచ్చేదని కానీ ఇక్కడ మాత్రం సంవత్సరానికి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నాను అంటూ ఆయన చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఏది ఏమైనా కూడా సత్యసాయి శ్రీనివాస్ లాంటి నటుడు ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం అని మరి కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా వరకు తగ్గిపోయారు. అదే సమయంలోనే ఆయనను ఇండస్ట్రీ ఆదుకుంటుంది. అలాగే తను ఇండస్ట్రీకి చాలా వరకు తన సహాయ సహకారాలను అందిస్తున్నాడు. పాజిటివ్ నెగెటివ్ అనే తేడా లేకుండా డిఫరెంట్ తరహా పాత్రలను పోషించడానికి ఆయన సిద్ధమవుతుండడం విశేషం…