Pooja Hegde Dance Video Viral: సోషల్ మీడియా లో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ వచ్చిందంటే చాలు, ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అనిరుద్ పాటలకు యూత్ ఆడియన్స్ లో మొదటి నుండి అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన పాటలు యావరేజ్ గా ఉన్నా ఒక రేంజ్ లో దున్నేస్తాయి, అలాంటిది చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ లో వైరల్ అయిపోతుంది. ఇలాంటి సందర్భాలు ఈమధ్య కాలం లో ఎన్నో చూశాము. అలాంటి చార్ట్ బస్టర్ సాంగ్ ని నిన్న ఆయన విడుదల చేశాడు. కూలీ(Coolie Movie) చిత్రం లో పూజా హెగ్డే(Pooja Hegde) చేసిన స్పెషల్ ఐటెం సాంగ్ కుర్రకారులను ఉర్రూతలూ ఊగించేస్తుంది. ఎక్కడ చూసినా ఈ పాట గురించే చర్చ. నెటిజెన్స్ తమ ప్రతిభ ని ఉపయోగించి ఎన్నో ఫన్నీ ఎడిట్స్ ని క్రియేట్ చేస్తున్నారు.
అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఎడిట్ వేరే లెవెల్ లో క్లిక్ అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి తయారు చేసిన ఈ వీడియో లో పూజా హెగ్డే డ్యాన్స్ వేస్తుంటే త్రివిక్రమ్ ఆడియన్స్ లో కూర్చొని ఈలలు వేస్తుంటాడు. ఎన్టీఆర్(Junior NTR) ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం లో ‘ఇది రణరంగం’ అనే పాట మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాటలో విలన్ స్టేజి మీద డ్యాన్స్ వేస్తున్న హీరోయిన్ ని చూసి వెర్రిక్కిపోతుంటాడు. ఆ విలన్ స్థానం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫోటో ని ఎడిట్ చేసి, మోనికా పాటకు పూజ హెగ్డే డ్యాన్స్ వేస్తున్నట్టు చూపించారు. ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ కి నవ్వులే నవ్వులు. ఎందుకంటే ఇండస్ట్రీ లో చాలా కాలం నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజా హెగ్డే మధ్య ఎదో సీక్రెట్ రిలేషన్ నడుస్తుంది అంటూ ఒక రూమర్ ప్రచారం అయ్యింది.
ఆ రూమర్ కి తగ్గట్టే ఈ వీడియో ని ఎడిట్ చేశారు. సోషల్ మీడియా అంతటా నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద మాత్రమే కాదు,పవన్ కళ్యాణ్,ప్రభాస్ ఇలా టాప్ హీరోలందరి మీద ఈ సాంగ్ తో ఎడిట్ చేశారు నెటిజెన్స్. అవి బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే మోనికా పాటకు యూట్యూబ్ లో ఇప్పటి వరకు 60 లక్షల వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఈ పాటలో పూజ హెగ్డే డ్యాన్స్ చూసి నెటిజెన్స్ వెర్రెక్కిపోతున్నారు. ఈ అమ్మాయి వల్ల సినిమా మీద ఉన్న హైప్ పదింతలు ఎక్కువ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పాటకు ఎన్ని మిలియన్ల వ్యూస్ వస్తాయో,ఇన్ స్టాగ్రామ్ లో ఎన్ని లక్షల రీల్స్ వస్తాయో చూడాలి.
Orey yevarra idhi chesindhi #Monica #PoojaHegde pic.twitter.com/C7lc3FHpwH
— Rebal Relangi (@RebalRelang) July 12, 2025