Homeఎంటర్టైన్మెంట్Peddi team latest announcement: ఎట్టకేలకు రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త చెప్పిన 'పెద్ది' టీం.....

Peddi team latest announcement: ఎట్టకేలకు రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త చెప్పిన ‘పెద్ది’ టీం.. ఇక ప్రతీ రోజు పండగే..

Peddi team latest announcement: గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ మూవీ టీం పై ఎంతటి తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారో చూస్తూనే ఉన్నాం. సినిమాకు పట్టుమని 20 రోజులు కూడా లేవని , కానీ టీం ప్రొమోషన్స్ ని అసలు పట్టించుకోవడం లేదని , ఆ కారణం ఈ చేత ఈ చిత్రం పై ఏర్పడిన హైప్ మొత్తం డైల్యూట్ అయ్యిందని , ఆ […]

Peddi team latest announcement: గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ మూవీ టీం పై ఎంతటి తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారో చూస్తూనే ఉన్నాం. సినిమాకు పట్టుమని 20 రోజులు కూడా లేవని , కానీ టీం ప్రొమోషన్స్ ని అసలు పట్టించుకోవడం లేదని , ఆ కారణం ఈ చేత ఈ చిత్రం పై ఏర్పడిన హైప్ మొత్తం డైల్యూట్ అయ్యిందని , ఆ ప్రభావం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై స్పష్టంగా కనిపిస్తుందని , రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ చేంజర్’ కంటే కూడా ఈ సినిమాకు తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుందని , ఇప్పటికైనా మేకర్స్ నిద్రలో నుండి మేలుకొని ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టాలని , లేదంటే ఓపెనింగ్స్ పై చాలా దారుణమైన ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

కొంతమంది అభిమానులు అయితే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటాము అంటూ కూడా బెదరించడం గమనార్హం. అందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి. అయితే అభిమానుల నుండి ఎదురు అవుతున్న అసంతృప్తి ని మేకర్స్ గమనించారు. వెంటనే స్పందిస్తూ ప్రొమోషన్స్ కి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 18 న ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేయబోతున్నామని , ఈ ఈవెంట్ లో అనేక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ నెల 23 న భోపాల్ లో అతి పెద్ద మ్యూజికల్ నైట్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నామని , ఈ ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ ని విడుదల చేయడం తో పాటు , సంగీత దర్శకుడు AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఉండబోతుందని చెప్పుకొచ్చారు.

ఈ రెండు ఈవెంట్స్ కూడా నార్త్ ఇండియా లో ఈ చిత్రం పై హైప్ ఏర్పడడానికి కారణం అవుతాయని , ప్రపంచవ్యాప్తంగా కూడా బజ్ మరోసారి క్రియేట్ అవుతుందని , అభిమానులు కంగారు పడాల్సిన అవసరమే లేదని , కచ్చితంగా ఈ చిత్రం మొదటి రోజున 100 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందు , అనేక ఇంటర్వ్యూస్ ని కూడా ప్లాన్ చేశారట. బాలీవుడ్ లోని ప్రముఖ టీవీ షోస్ కి కూడా పెద్ది టీం వెళ్లి ప్రొమోషన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రొమోషన్స్ లేవు అని అభిమానుల పడుతున్న బాధకు ఈ నెల 18 న తెరపడనుంది. అప్పటి నుండి ప్రతీ రోజు మేకర్స్ ప్రొమోషన్స్ తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper