Homeఎంటర్టైన్మెంట్Suriya Veerabhadrudu advance bookings: అత్యంత దయనీయమైన పరిస్థితిలో సూర్య 'వీరభధ్రుడు'..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే..

Suriya Veerabhadrudu advance bookings: అత్యంత దయనీయమైన పరిస్థితిలో సూర్య ‘వీరభధ్రుడు’..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే..

Suriya Veerabhadrudu advance bookings: సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా తమిళ హీరో సూర్య పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల తర్వాత అత్యధిక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ ఇతను. ఇక మన టాలీవుడ్ లో అయితే ఒకప్పుడు ఇతని సినిమాకు మన స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ , […]

Suriya Veerabhadrudu advance bookings: సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా తమిళ హీరో సూర్య పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల తర్వాత అత్యధిక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ ఇతను. ఇక మన టాలీవుడ్ లో అయితే ఒకప్పుడు ఇతని సినిమాకు మన స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ , ఫుల్ రన్ కలెక్షన్స్ వచ్చేవి. అంతటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ , ఇప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో దారుణమైన పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు సూర్య సినిమాలకు యూత్ ఆడియన్స్ లో ఆసక్తి బాగా తగ్గిపోయింది. ఈ నెల 14 న విడుదల అవ్వబోతున్న ‘కరప్పు’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యంత దారుణమైన గ్రాస్ నమోదు అయ్యింది.

ముఖ్యంగా ఓవర్సీస్ ప్రాంతం లో టికెట్స్ అసలు అమ్ముడుపోవడం లేదు. నార్త్ అమెరికా మొత్తం మీద ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ ఎంతో తెలుసా?, అక్షరాలా 6 వేల డాలర్లు మాత్రమే. మన టాలీవుడ్ శ్రీ విష్ణు కి కూడా 2 లక్షల డాలర్లు ప్రీమియర్స్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండి వస్తున్న గ్రాస్ ఇది. అలాంటిది సూర్య లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి కేవలం 6 వేల డాలర్లు రావడం అనేది ఎంతటి అవమానకరమైన విషయంలో మీరే అర్థం చేసుకోండి. ఇక ఇండియా లో రాష్ట్రాల వారీగా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ వసూళ్లు ఎంతో ఒకసారి వివరంగా మీ ముందు ఉంచబోతున్నాము. ముందుగా తమిళనాడు విషయానికి ఈ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 4 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే నమోదు అయ్యాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

సూర్య స్థాయికి ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కేవలం 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదైంది. ఒకప్పుడు సూర్య కి తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేవి, అలాంటిది ఇప్పుడు కోటి గ్రాస్ కూడా బుకింగ్స్ ద్వారా నమోదు అవ్వలేదు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రము నుండి 60 లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, కేరళ నుండి 50 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా వచ్చాయి. చూస్తుంటే ఈ చిత్రానికి రీసెంట్ గా విడుదలైన ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ కంటే తక్కువ గ్రాస్ నమోదు అవ్వొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper