Peddi movie Nizam release issue: టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతానికి పీకల్లోతు కష్టాల్లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 శాతం కి పైగా థియేటర్స్ సినిమాలు లేక మూత పడ్డాయి అంటే నమ్ముతారా?, కానీ అదే నిజం. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత , ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వలేదు. పెద్ద సినిమాలు ఆడకపోయినా కనీసం చిన్న సినిమాలైనా బయ్యర్స్ ని ఆదుకునేవి, కానీ ఇప్పుడు అది కూడా జరగడం లేదు. ఇంతటి దారుణమైన స్థితిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం మీదనే ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు , ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి , ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి.
ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని , రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడనే టాక్ నడుస్తోంది. అయితే ఇండస్ట్రీ బాగుపడే సమయం లో , దిల్ రాజు వర్గం నైజాం ప్రాంతం లో చేస్తున్న తిరుగుబాటు , ఇప్పుడు ‘పెద్ది’ విడుదలపై అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నాయి. ‘పెద్ది’ చిత్రం నైజాం థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కొనుగోలు చేయడం వల్లే ఈ సమస్య. దిల్ రాజు , మైత్రీ మూవీ మేకర్స్ మధ్య నైజాం ప్రాంతం లో కోల్డ్ వార్ ఎంతో కాలం నుండి నడుస్తోంది , ఆ సంస్థ నుండి విడుదల అవుతున్న సినిమా కాబట్టే, అడ్డంకులు క్రియేట్ చేయాలనీ దిల్ రాజు గ్యాంగ్ ఇప్పుడు కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడపాలని డిమాండ్ ని తీసుకొచ్చారని , ‘పెద్ది’ చిత్రానికి అడ్డంకులు బలంగా ఏర్పాటు చేయాలనీ ఈ గ్యాంగ్ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు.
ఇండస్ట్రీ లో ఈ కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడపాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది , కానీ సరిగ్గా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి విడుదల అయ్యేటప్పుడే ఈ సమస్యలను తీవ్రవతం చేయాలనే ఆలోచన రావడం కచ్చితంగా టార్గెట్ కిందకే వస్తుంది. ఈ నెల ప్రారంభం లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి విడుదలైన ‘జెట్ లీ’ చిత్రాన్ని దిల్ రాజు ప్రాపర్టీస్ మరియు ఏషియన్ ప్రాపర్టీస్ లో విడుదలని బ్యాన్ చేశారు. ఆ కారణంగా ఆ చిత్రం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రాన్ని కూడా వాళ్ళ థియేటర్స్ లో బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు గ్యాంగ్ ఆడుతున్న ఈ హై డ్రామా కు కౌంటర్ గా నేడు మైత్రీ మూవీ మేకర్స్ , సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలకు చెందిన నిర్మాతలు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నారు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.