Homeఎంటర్టైన్మెంట్Ram Charan Fan Viral Video: 'పెద్ది' క్రికెట్ షాట్స్..రామ్ చరణ్ నే మించిపోయిన అభిమాని.....

Ram Charan Fan Viral Video: ‘పెద్ది’ క్రికెట్ షాట్స్..రామ్ చరణ్ నే మించిపోయిన అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో..

Ram Charan Fan Viral Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య కాలం లో ఈ రేంజ్ వసూళ్లను చూసి మన టాలీవుడ్ […]

Ram Charan Fan Viral Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య కాలం లో ఈ రేంజ్ వసూళ్లను చూసి మన టాలీవుడ్ ఎన్ని రోజులైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వీకెండ్ లోనే 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఫుల్ రన్ లో కచ్చితంగా 150 కోట్ల షేర్ వసూళ్లను కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇక సోషల్ మీడియా లో కూడా ఎక్కడ చూసినా ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తోంది. సినిమాల్లో కొత్తగా ఏదైనా క్లిక్ అయితే, వాటిని అనుసరిస్తూ హంగామా చేసే జెన్ జీ ఆడియన్స్ , ఈ చిత్రానికి కూడా ఇన్ స్టాగ్రామ్ లో అదే రేంజ్ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం లో రామ్ చరణ్ క్రికెట్ షాట్స్ ని అంత తేలికగా ఆడియన్స్ మర్చిపోలేరు , థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడు ఈ చిత్రం నుండి మర్చిపోలేని షాట్స్ లిస్ట్ తీస్తే , కచ్చితంగా ఈ క్రికెట్ షాట్స్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఈ షాట్స్ ని అనుసరిస్తూ జెన్ జీ యూత్ క్రియేట్ చేసిన కొన్ని వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అందులో ఒక వీడియోలో అభిమాని ఆడిన క్రికెట్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్ ని మించి ఆ అభిమాని ఇందులో క్రికెట్ షాట్స్ ని క్రియేట్ చేశాడు . అవి చూసేందుకు చాలా బాగున్నాయి , ఇవి డైరెక్టర్ బుచ్చి బాబు వరకు చేరితే, అరెరే , ఇలాంటి షాట్స్ పెట్టలేకపోయానే , ఎవరీ కుర్రాడు ఇంత టాలెంట్ గా ఉన్నాడు అని అతన్ని పిలిపించి , రామ్ చరణ్ తో కలిపించేలా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. ఆ రేంజ్ లో ఉంది ఆ షాట్. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ ఇన్ స్టాగ్రామ్ రీల్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే ఈ సినిమా బంపర్ హిట్ అయ్యినందుకు గానూ నేడు మేకర్స్ గ్రాండ్ గా థాంక్యూ మీట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ కూడా రాబోతున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper