Homeఎంటర్టైన్మెంట్Peddi movie losses in two regions: ఆ రెండు ప్రాంతాల్లో 'పెద్ది' కి భారీ...

Peddi movie losses in two regions: ఆ రెండు ప్రాంతాల్లో ‘పెద్ది’ కి భారీ నష్టాలు తప్పేలా లేవుగా.. ఇలా జరుగుతుందని ఊహించలేదు..

Peddi movie losses in two regions: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో ఎంత సూపర్ హిట్ సినిమాకు అయినా , మొదటి వీకెండ్ తర్వాత భారీ వసూళ్లు రావడం అనేది […]

Peddi movie losses in two regions: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో ఎంత సూపర్ హిట్ సినిమాకు అయినా , మొదటి వీకెండ్ తర్వాత భారీ వసూళ్లు రావడం అనేది చాలా కష్టం గా మారింది. అలాంటిది ఈ చిత్రానికి సోమవారం రోజు కూడా అద్భుతమైన గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి భారీ లాభాలను సొంతం చేసుకుంటుంది , అందులో ఎలాంటి సందేహం లేదు.

కానీ ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. ఆ ప్రాంతం లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడబోతుంది ఈ చిత్రం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం , ఈ చిత్రానికి ఓవర్సీస్ లో 10 మిలియన్ డాలర్ల పే రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వస్తుందని అనుకున్నారు కానీ , 5 రోజులు దాటినప్పటికీ కూడా అంతటి గ్రాస్ నమోదు అవ్వలేదు. దీంతో ఓవర్సీస్ బయ్యర్స్ తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి 7 మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఇప్పటి వరకు కేవలం ఆ ప్రాంతం నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఈ వారం తో పూర్తిగా థియేట్రికల్ రన్ కూడా అయిపోనుంది. మరో పక్క నైజాం ప్రాంతం లో కూడా ఈ చిత్రానికి నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఈ చిత్రానికి దాదాపుగా 58 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. భవిష్యత్తులో ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి. అయితే ఈ సినిమా 50 కోట్ల మార్కుని అయితే కచ్చితంగా అందుకుంటుందని , 58 కోట్లు వసూలు చేయడం ప్రస్తుతానికి కష్టమని , ఈ ప్రాంతంలో భారీ నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు , చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper