Homeఎంటర్టైన్మెంట్Pawan kalyan fans : నెల రోజుల గ్యాప్ లో రెండు పవన్ కళ్యాణ్ కొత్త...

Pawan kalyan fans : నెల రోజుల గ్యాప్ లో రెండు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు విడుదల..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్!

Pawan kalyan fans :భీమ్లా నాయక్’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి కావొస్తుంది. గత ఏడాది ‘బ్రో ది అవతార్’ చిత్రం విడుదల అయ్యింది కానీ, అందులో పవన్ కళ్యాణ్ కేవలం ముఖ్య పాత్రని మాత్రమే పోషించాడు కాబట్టి ఆయన మెయిన్ చిత్రాల క్యాటగిరీ లోకి రాదు. గత ఏడాది నుండి నేటి వరకు రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీ రాజ్, పర్యావరణం, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ మరియు సైన్స్ & టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడని అందరూ అనుకుంటే, తన విధి నిర్వహణ బాధ్యతల్లో ఆయన నిమగ్నమై ఇన్ని రోజులు షూటింగ్స్ కి దూరంగా ఉంటూ వచ్చాడు.

అయితే ఈ నెల 22 వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు. ఏడాది విరామం తర్వాత మళ్ళీ కెమెరా ఆయన కెమెరా ముందుకు వస్తున్న తరుణం ఇది. ముందుగా ఓజీ చిత్రానికి డేట్స్ ఇస్తాడని అందరూ అనుకున్నారు కానీ, ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. ఈ నెల 22 వ తారీఖు నుండి నాన్ స్టాప్ గా 20 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు సినిమా షూటింగ్స్ జరుగుతాయని, మధ్యాహ్నం నుండి మళ్ళీ తన డిప్యూటీ సీఎం పనుల్లోకి వెళ్ళిపోతాడని అంటున్నారు. అయితే ఇక్కడ అభిమానులకు మరో శుభవార్త ఏమిటంటే, వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందట. హరి హర వీరమల్లు చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విడుదలైన నెల రోజులకు,అంటే మార్చి నెలలో ‘ఓజీ’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రం కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.

ఇలా నెల రోజుల తేడాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రెండు క్రేజీ కొత్త చిత్రాలు విడుదల అవ్వబోతుండడం విశేషం. మరి ఈ రెండు చిత్రాలలో ఏది సక్సెస్ అవ్వబోతుంది, ఏ చిత్రానికి ఎక్కువ వసూళ్లు రాబోతున్నాయి అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా హరి హర వీరమల్లు చిత్రం నుండి డైరెక్టర్ క్రిష్ డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. అత్యధిక కాలం ఈ సినిమాకే ఆయన సమయం కేటాయించడం, అందువల్ల వేరే ప్రాజెక్ట్స్ మిస్ అవుతుండడంతో ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. మిగిలిన భాగం షూటింగ్ కి ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper