Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ఊహించని షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..ఇలా అయితే...

Pawan Kalyan: డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ఊహించని షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..ఇలా అయితే కష్టమే!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) తో చేయబోతున్న సందర్భంగా, ఈ సినిమా స్క్రిప్ట్ చర్చల్లో తరచూ జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గానే సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి పవన్ కళ్యాణ్ కి ఫైనల్ న్యారేషన్ ఇచ్చారు. అయితే అంతకు ముందే పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ కి పచ్చ జెండా ఊపారు కానీ, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పాడు. సురేందర్ రెడ్డి, […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) తో చేయబోతున్న సందర్భంగా, ఈ సినిమా స్క్రిప్ట్ చర్చల్లో తరచూ జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గానే సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి పవన్ కళ్యాణ్ కి ఫైనల్ న్యారేషన్ ఇచ్చారు. అయితే అంతకు ముందే పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ కి పచ్చ జెండా ఊపారు కానీ, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పాడు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ ఆ మార్పుల పై గట్టిగా పని చేసి, రీసెంట్ గానే మోడిఫైడ్ స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కి వినిపించారు. కానీ సురేందర్ రెడ్డి చేసిన మార్పులు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు. మరోసారి స్క్రిప్ట్ మీద రీ వర్క్ చేయమని చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ ఆ పని మీదనే ఉన్నారు.

మరో వారం రోజుల్లో మార్పులు చేసిన స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కి వినిపించనున్నాడు. అది ఆయనకు నచ్చితే, వెంటనే డేట్స్ ఇస్తాడట. స్క్రిప్ట్ లో మార్పులు ఆయనకు నచ్చకపోతే ఇప్పట్లో డేట్స్ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఇదంతా విన్న అభిమానులు, ఉప ముఖ్యమంత్రిగా ఇంత బిజీ గా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ మీద ఇంత ఫోకస్ పెడుతున్నాడా?, ఆశ్చర్యంగా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మే నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మార్చి 19న ఈ ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు తప్ప, మరో సినిమాకు కమిట్మెంట్ ఇవ్వలేదు. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ కాంబినేషన్స్ పై అనేక రూమర్స్ వచ్చాయి కానీ, అవన్నీ ప్రస్తుతానికి రూమర్స్ మాత్రమే, నిజాలు లేవు.

‘ఓజీ 2’ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ ఇంకా సంతకం చేయలేదు. ఈ సినిమా నుండి DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తప్పుకుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సుజిత్ నాని తో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాకనే ‘ఓజీ 2’ పనులు మొదలు కాబోతున్నాయి. అంటే వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో మొదలు అవ్వొచ్చు అన్నమాట. అప్పటి వరకు ఈ సినిమా ప్రస్తావన ఉండదని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నయించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తాన్ని పూర్తి చేసుకొని వచ్చే నెల 26 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper