Homeబిజినెస్Suzuki New Electric Scooter 2026: Suzuki కొత్త ఈ స్కూటర్.. మైలేజ్ బెస్ట్.. ఈ...

Suzuki New Electric Scooter 2026: Suzuki కొత్త ఈ స్కూటర్.. మైలేజ్ బెస్ట్.. ఈ విషయంలో మాత్రం నిరాశే..

Suzuki New Electric Scooter 2026: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా కంపెనీలు వీటిని మార్కెట్లోకి తీసుకురావడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీ Suzuki ఒక కొత్త ఈవీని ఈ జనవరిలో మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే ఫిబ్రవరి 14 వరకు దీని సేల్స్ మిగతా వాటికంటే తక్కువగానే ఉన్నాయని లెక్కలు చూపిస్తుంది. కానీ ఇందులో ఉండే ఫీచర్స్, ఇంజన్, మైలేజ్ చూస్తే మాత్రం నేటి తరం వారికి అనుగుణంగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ చార్జింగ్ కూడా ఫాస్టెస్ట్ ఉండడంతో బిజీగా ఉండే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ స్కూటర్ పూర్తి వివరాల్లోకి వెళితే..

2026 కొత్త ఏడాది సందర్భంగా సుజుకి కంపెనీ కొత్తగా ఈ యాక్సిస్ పేరుతో స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు దీని అమ్మకాలు 370 యూనిట్లుగా ఉన్నాయి. అయితే జనవరిలో 201 యూనిట్లు రిజిస్టర్ కాగా ఫిబ్రవరి మొదటి వారంలో మరో 169 యూనిట్లు సేల్స్ అయ్యాయి. అయితే ఈ అమ్మకాలు ఆశించినంతగా లేకపోయినప్పటికీ ఇందులో ఉండే బ్యాటరీ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఈ స్కూటర్లో 3 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ పాస్పెట్ బ్యాటరీ ని అమర్చారు. ఇది సాధారణ బ్యాటరీ కంటే విభిన్నంగా ఉంటుంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా దీనికి ఉన్న 4.1 kW బ్యాటరీతో 71 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పోర్టబుల్ చార్జర్ ద్వారా దీనిని చార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఇంటి వద్ద దీనికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ 8 శాతం వరకు చార్జింగ్ కావడానికి 4:30 సమయం పడుతుంది. 100% పూర్తికావడానికి 6 గంటల 42 నిమిషాల సమయం పడుతుంది. అయితే మరింత ఫాస్టెస్ట్ చార్జింగ్ కావడానికి DC చార్జర్ అవైలబుల్ ఉంది. పాత యాక్సెస్ స్కూటర్ వలె దీని లుక్ ఉన్నప్పటికీ.. కొన్ని రకాల అదనపు ఫీచర్లు ఇందులో చూడవచ్చు. ఈ కొత్త స్కూటర్లో డిజిటల్ మీటర్, స్ఫూర్తి లుక్ ఇస్తూ అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా స్టైలిష్ బైక్ కావాలని అనుకునేవారు సైతం దీనిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ. 1.80 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే మిగతా స్కూటర్ల కంటే దీని ధర ఎక్కువగానే ఉందని కొందరు అంటున్నారు. అయినా కూడా వీటి కొనుగోలు పెరుగుతుండడం విశేషం. ఇది మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పట్టినప్పటికీ విక్రయాల్లో మాత్రం వేగం పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ ప్రతినిధులు అంటున్నారు. అయితే ముందు ముందు ఎలాంటి సేల్స్ ఉంటుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular