Homeఎంటర్టైన్మెంట్బండ్లకి పవన్ కళ్యాణ్ షాక్.. ఇప్పట్లో కష్టమే !

బండ్లకి పవన్ కళ్యాణ్ షాక్.. ఇప్పట్లో కష్టమే !

బండ్ల గణేష్ కి ఎట్టిపరిస్థితుల్లో ‘పవన్ కళ్యాణ్’ ఇప్పట్లో డేట్స్ ఇవ్వడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. అయినా ‘మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం’ అని ఒక పాత సామెత ఒకటి ఉంది. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆలోచనా విధానం కూడా ఇలాగే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల జాబితా ఇప్పటీకే లెక్కకి మించిపోయి ఉంటే.. చివరి లెక్కగా తన సినిమా గురుంచి ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే పవన్ వెనుక నిర్మాతలు పెద్ద క్యూలో ఉన్నారు. పైగా వాళ్ళు ఇప్పటి నిర్మాతలు కూడా కాదు, సీనియర్ మోస్ట్ నిర్మాతలు.

మరి అలాంటి వాళ్ళకి పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయినా బండ్ల మాత్రం పవన్ తనకు డేట్స్ ఇస్తాడనే హాప్ తో ఉన్నాడు. రీఎంట్రీ తరువాత వచ్చిన వకీల్ సాబ్ భారీ విజయాన్ని నమోదు చేయడంతో బండ్లకి మరింత ఆశ పెరిగిపోయింది. ఎలాగైనా పవన్ తో మళ్ళీ ఒక సినిమా చేయాలని బండ్ల అమ్మవారికి తెగ పూజలు చేస్తున్నాడట. అయినా ఎన్ని చేస్తే ఏమి ఉపయోగం… ఎప్పుడో జమానా కాలం నాడే పవన్ కి అడ్వాన్స్ ఇచ్చి కూర్చింది మైత్రీ మూవీస్ సంస్థ.

అందుకే ఈ సంస్థ తెలివిగా హరీష్ శంకర్ ను సెట్ చేసుకుంది. అతని డైరెక్షన్ లోనే ఇప్పుడు సినిమా చేయడానికి సన్నద్ధం అవుతుంది. పవన్ తరువాత సినిమా ఇదే. ఇక ఆ తరువాత జనసేనకు సేవలందించిన రామ్ తాళ్లూరి కోసం కూడా పవన్ ఒక సినిమా చేయాల్సి ఉంది. పైగా రామ్ తాళ్లూరి అంటే పవన్ కి ప్రత్యేక అభిమానం ఉంది, కాబట్టి ఈ సినిమా పూర్తి అయ్యేవరకూ పవన్ బండ్లకి డేట్స్ ఇవ్వడు.

ఎలాగూ ఈ మధ్యలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్, అలాగే క్రిష్ సినిమాలు ఉన్నాయి. అలాగే వంశీ పైడిపల్లి – దిల్ రాజు – పవన్ కలయికలో మరో సినిమా ఉందని ఇప్పటికే గ్యాసిప్ లు కూడా మొదలైపోయాయి. ఈ సినిమాలు కాకుండా పవన్ – త్రివిక్రమ్ కలిసి పెట్టిన బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నాడు. మరి ఇవ్వన్నీ విన్న తరువాత, తన దేవుడు తనను కరుణిస్తాడని బండ్ల నిజంగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వగలడా !

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper