Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh 2nd Song: 'ఉస్తాద్ భగత్ సింగ్' 2వ పాట కోసం ఆస్కార్...

Ustaad Bhagat Singh 2nd Song: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2వ పాట కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత..సంచలనం రేపుతున్న ట్వీట్!

Ustaad Bhagat Singh 2nd Song: ‘ఓజీ'(They Call Him OG) లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, అతి త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించుకోనుంది. ఈ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని […]

Ustaad Bhagat Singh 2nd Song: ‘ఓజీ'(They Call Him OG) లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, అతి త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించుకోనుంది. ఈ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట. అయితే రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 44 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అతి త్వరలోనే 50 మిలియన్ వ్యూస్ మార్కుని అందుకోనుంది.

దేవిశ్రీప్రసాద్ అందించిన ఆ ట్యూన్ యావరేజ్ గానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ వేసిన అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు ఆ పాటని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి. పవర్ స్టార్ ఈ రేంజ్ డ్యాన్స్ చేయగలడా అని ఈ పాటని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే ఈ చిత్రం నుండి రెండవ పాట ని విడుదల చేయబోతున్నారట. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ సాహిత్యం అందించాడు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని, ఆయన ఆరా ని వర్ణిస్తూ ఈ పాట ఉంటుందట. ఈ విషయం గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తూ ‘పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం పాట రాసే విషయానికి వస్తే మా చంద్ర బోస్ గారికి లిమిట్స్ ఉండవు, బౌండరీలు ఉండవు. ఆస్కార్ అవార్డుని పొందిన తర్వాత ఆయనతో చేస్తున్న మొదటి సినిమా ఇది. అప్పట్లో ఎలా ఉండేవాడో , ఇప్పటికీ మాతో అలాగే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఆరా ని రీ డిఫైన్ చేస్తూ త్వరలోనే ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ మీ ముందుకు రాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.

ఇది విన్న అభిమానులు, హరీష్ శంకర్ కి మొదటి నుండి మ్యూజిక్ మీద మంచి అభిరుచి ఉంది. సంగీత దర్శకుల నుండి ఆయన ది బెస్ట్ ని రాబట్టుకుంటాడు. ఇప్పుడు ఆయనకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం దొరికింది కాబట్టి, దేవి శ్రీ ప్రసాద్ నుండి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని కోటించుకుంటాడు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రెండవ పాట అభిమానులను, ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper