Nidhi Agarwal praises Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో ‘అజ్ఞాతవాసి’ తర్వాత అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ ఏదైనా ఉందా అంటే, అది ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) మాత్రమే. ఆరేళ్ళ పాటు సెట్స్ మీదున్న ఈ సినిమా , ఎన్నో ఇబ్బందులను ఎదురుకొని ఎట్టకేలకు థియేటర్స్ లోకి గత ఏడాది జులై 24న వచ్చింది. ప్రీమియర్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, మొదటి రోజు ఓపెనింగ్స్ లో అదరగొట్టేసింది కానీ, రెండవ రోజు నుండి మాత్రం కలెక్షన్స్ పేకమేడలాగా కూలిపోయింది. అలాంటి డిజాస్టర్ ఫ్లాప్ చిత్రం లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్(Nidhi Agarwal), రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ తో పని చేసే ప్రతీ ఒక్కరు ఆయనకీ అడిక్ట్ అయిపోతుంటారు, నిధి అగర్వాల్ కూడా ఆయనకు వీరాభిమాని అయిపోయినట్టు ఆమె మాటలు చూస్తే తెలుస్తోంది.
యాంకర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు పవన్ కళ్యాణ్ గారితో పని చేశారు కదా, ఆయనతో మీ అనుభవం ఎలాంటిదో చెప్పండి’ అని అడుగుతాడు. దానికి నిధి అగర్వాల్ సమాధానం చెప్తూ ‘ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఆయన్ని దేవుడి లాగా కొలుస్తారు. ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. ఆయనతో పని చేస్తున్న సమయంలో అభిమానులు నా వద్దకు వచ్చి, బాగా చేయండి, మీరు మా దేవుడితో చేస్తున్నారు అని అనేవారు. నేను నా బెస్ట్ ఇస్తాను అని చెప్పేదానిని. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన వారు. ఆయన చుట్టూ ఉండే ఆరా ఎంతో ఆకర్షవంతమైంది. ఆయన నిల్చున్న, కూర్చున్నా, నడిచినా, మాట్లాడినా, ఎంతో స్టైల్ గా ఉంటుంది. దానిని మాటల్లో వర్ణించలేము’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆయనలో ఉన్నంత ధైర్యాన్ని ఇప్పటి వరకు నేను ఎవరిలోనూ చూడలేదు. చాలా బోల్డ్ గా మాట్లాడుతాడు. దేశం లో కొన్ని టాపిక్స్ ని ఎవ్వరూ ముట్టుకోరు. కానీ ఆయన వాటిపైన కూడా మాట్లాడుతాడు. అభిమానులు అందుకే ఆయన్ని అంతలా ఆరాధిస్తారేమో. ఆయన ఇమేజ్ బాక్స్ ఆఫీస్ కి చాలా అతీతమైనది. హిట్లు, ఫ్లాపులు ఆయన క్రేజ్ పై ఇసుమంత ప్రభావం కూడా చూపదు’ అంటూ చెప్పుకొచ్చింది. నిధి అగర్వాల్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాటలను చూస్తుంటే పవన్ కళ్యాణ్ కి ఎంత అడిక్ట్ అయిపోయిందో అర్థం అయ్యింది అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వీడియో ని షేర్ చేస్తున్నారు.