spot_img
Homeఎంటర్టైన్మెంట్DSP disappointed Pawan Kalyan fans: పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చిన దేవిశ్రీ ప్రసాద్..ఇలా...

DSP disappointed Pawan Kalyan fans: పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చిన దేవిశ్రీ ప్రసాద్..ఇలా అయితే కష్టమే!

DSP disappointed Pawan Kalyan fans: సినీ ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్స్ ని ప్రేక్షకులు గుడ్డిగా నమ్మేయొచ్చు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) కాంబినేషన్. వీళ్ళ కలయిక లో ఇప్పటి వరకు వచ్చిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లోని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా జల్సా చిత్రం లోని పాటలను ఇప్పటికీ వింటూనే ఉంటారు మ్యూజిక్ లవర్స్. అలాంటి కాంబినేషన్ ఇది. రీసెంట్ గా ఈ కాంబినేషన్ తో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి, పైగా ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ కి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉండడం వల్ల, కచ్చితంగా ఈ సినిమాలోని పాటలు వేరే లెవెల్ లో ఉంటాయని అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలపై దేవిశ్రీ ప్రసాద్ నీళ్లు జల్లాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘దేఖ్ లేంగే సాలా’ అనే పాట విడుదలైంది. పాట అయితే ఒక మోస్తరు గా హిట్ అయ్యింది కానీ, అది దేవిశ్రీప్రసాద్ వల్ల మాత్రం కాదు. ఎందుకంటే ఈ పాటలో పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు బాగా క్లిక్ అయ్యాయి. ఆ కారణం చేత యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చాయి, అంతే తప్ప దేవిశ్రీ ప్రసాద్ చాలా రొటీన్ ట్యూన్ అందించాడని అభిమానులు మండిపడ్డారు. ఇక నిన్న ఈ చిత్రం నుండి ‘ఎత్తరా..ఎత్తరా..కాలరే ఎత్తరా’ అనే పాట సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ పాట ని విన్న అభిమానులు, ఇంత రొటీన్ ట్యూన్ ఎలా ఇచ్చావు?, ఇది పవన్ కళ్యాణ్ సినిమా అనే విషయాన్నీ మర్చిపోయావా?, నీ పాత సినిమాల్లోని ‘ఫుల్ కిక్కు’ అనే పాటకు రీమేక్ లాగా ఉంది ఇది, ఇంత నాసిరకమైన రొటీన్ ట్యూన్ మాకు అంటగడుతావా అంటూ ఒక రేంజ్ లో మండిపడ్డారు ఫ్యాన్స్.

మొదటి పాట ఎలా అయితే పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వల్ల హిట్ అయ్యిందో, ఈ పాట కూడా ఆయన వల్లే హిట్ అవ్వాలి, దేవి శ్రీ ప్రసాద్ పూర్తిగా హ్యాండ్ ఇచ్చేసాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు. ఆ ద్రుష్టి మొత్తం ఆ సినిమా మీదనే ఉండడం వల్ల, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్లక్ష్యం చేసాడని అంటున్నారు విశ్లేషకులు. మార్చి 26 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పుడు ఏ సినిమాకి అయినా మార్కెట్ లో క్రేజ్ రావాలంటే సాంగ్స్ పేలడం ముఖ్యం. కానీ ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు అలాంటి సాంగ్ అయితే రాలేదు. సినిమా విడుదలకు పట్టుమని 50 రోజుల సమయం కూడా లేదు. ఇలాంటి సమయంలో చిత్రం పై పాజిటివ్ బజ్ ఇంకా క్రియేట్ అవ్వకపోవడం అభిమానులను కాస్త కంగారుకి గురి చేస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper