Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ పై మరోసారి నోరు జారిన త్రిగున్..రణరంగంగా మారిన 'బిగ్...

Bigg Boss 10 Telugu: రోహిత్ పై మరోసారి నోరు జారిన త్రిగున్..రణరంగంగా మారిన ‘బిగ్ బాస్ 10’ హౌస్!

Bigg Boss 10 Telugu: ఊహించిన దానికంటే ది బెస్ట్ గా సాగుతోంది ‘బిగ్ బాస్ 10’. గత సీజన్ లో బంధాలు , అనుబంధాలు , వాటి చుట్టూ జరిగే గొడవలనే మనం ఎక్కువగా చూస్తూ వచ్చాము. ఇదేమి సీరియల్ డ్రామా రా బాబు అని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ ఈ సీజన్ లో మాత్రం నువ్వా , నేనా అని తలపడే రేంజ్ గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా త్రిగున్ అయితే అందరినీ డామినేట్ […]

Bigg Boss 10 Telugu: ఊహించిన దానికంటే ది బెస్ట్ గా సాగుతోంది ‘బిగ్ బాస్ 10’. గత సీజన్ లో బంధాలు , అనుబంధాలు , వాటి చుట్టూ జరిగే గొడవలనే మనం ఎక్కువగా చూస్తూ వచ్చాము. ఇదేమి సీరియల్ డ్రామా రా బాబు అని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ ఈ సీజన్ లో మాత్రం నువ్వా , నేనా అని తలపడే రేంజ్ గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా త్రిగున్ అయితే అందరినీ డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సెలబ్రిటీలందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నాడు. ముఖ్యంగా అందరినీ రోహిత్ కి వ్యతిరేకంగా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. రోహిత్ పై ఇతనికి ఉన్నటువంటి అక్కసు ని చూస్తుంటే, భవిష్యత్తులో వీళ్ళ మధ్య గొడవలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘బిగ్ బాస్ 7’ లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ , ‘బిగ్ బాస్ 8’ లో నిఖిల్ , గౌతమ్ , ‘బిగ్ బాస్ 4’ లో అభిజిత్ , అఖిల్ మధ్య ఎలాంటి గొడవలు జరిగేవో , అలాంటి గొడవలు వీళ్లిద్దరి మధ్య రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో వీళ్లిద్దరి మధ్య ఏ రేంజ్ లో గొడవలు జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లిపోయారు , కొట్టుకుంటారేమో అనే రేంజ్ వాతావరణం ఏర్పడింది. ఇక ఆ తర్వాత త్రిగున్ , ముకేశ్ గౌడ మరియు రోహిత్ , వంశీ మధ్య ఒక టాస్క్ ని నిర్వహిస్తారు. ఈ టాస్క్ లో రోహిత్, వంశీ లు గెలుస్తారు. ఇది రోహిత్ ఫ్యాన్స్ కి పెద్ద గూస్ బంప్స్ ఇచ్చే సందర్భం అనే చెప్పాలి. అయితే ఈ సంఘటన తర్వాత రోహిత్ పై త్రిగున్ మరింత పగ పెంచేసుకున్నాడు. నిన్న డిష్ వాషింగ్ సమయం లో ఎలా అయితే రోహిత్ తో గొడవలు పెట్టుకున్నాడో , ఈరోజు కూడా డిష్ వాషింగ్ దగ్గరే రోహిత్ తో గొడవ పెట్టుకున్నాడు.

అంతేకాదు , టాస్క్ జరిగే ముందు త్రిగున్ రోహిత్ పై నోరు జారీ ఒక మాట అన్నాడని , ఆ మాటకు రోహిత్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడని , ఇద్దరి మధ్య జరిగిన గొడవకు హౌస్ మొత్తం రణరంగాన్ని తలపించే వాతావరణం లోకి వెళ్లిపోయిందని అంటున్నారు. మరి ఈ గొడవలో తప్పు ఎవరిదీ అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ టెలికాస్ట్ వరకు ఆగాల్సిందే. ఇకపోతే నేడే మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ ని కూడా చూపియొచ్చు. ఈ ప్రక్రియ ద్వారా చరణ్ ని ఎలిమినేటి చేసారు. మరి ఈ వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper