Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' లోకి రాబోతున్న 8 మంది వైల్డ్...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి రాబోతున్న 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్ళే!

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 10’ ఎట్టకేలకు రీసెంట్ గానే మొదలైంది. అనుకున్న దానికంటే ఎక్కువ బజ్ తోనే ఈ సీజన్ ముందుకు దూసుకెళ్తోంది. కంటెస్టెంట్స్ మధ్య హీట్ వాతావరణం మామూలు రేంజ్ లో లేదు. ముఖ్యంగా త్రిగున్ , రోహిత్ మధ్య గొడవలు అయితే బాహుబలి , భళ్లాలదేవ గొడవలను తలపిస్తున్నాయి. షో మొత్తం వీళ్లిద్దరి చుట్టూనే తిరిగేలా అనిపిస్తోంది. […]

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 10’ ఎట్టకేలకు రీసెంట్ గానే మొదలైంది. అనుకున్న దానికంటే ఎక్కువ బజ్ తోనే ఈ సీజన్ ముందుకు దూసుకెళ్తోంది. కంటెస్టెంట్స్ మధ్య హీట్ వాతావరణం మామూలు రేంజ్ లో లేదు. ముఖ్యంగా త్రిగున్ , రోహిత్ మధ్య గొడవలు అయితే బాహుబలి , భళ్లాలదేవ గొడవలను తలపిస్తున్నాయి. షో మొత్తం వీళ్లిద్దరి చుట్టూనే తిరిగేలా అనిపిస్తోంది. ఇలాంటి సమయం లో బిగ్ బాస్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని తీసుకొస్తుంటాడు. వీళ్ళు హౌస్ లోపల సృష్టించే భీబత్సం ఎలాంటిదో గత సీజన్ లో మనమంతా చూసాము. ఈ సీజన్ లో కూడా ఆ రేంజ్ స్టఫ్ ఉన్న కంటెస్టెంట్స్ ని ఎంచుకునే ప్రయత్నం లో ఉన్నారట మేకర్స్. మొత్తం మీద 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని తీసుకొని రాబోతున్నారట.

ముందుగా ‘అగ్ని పరీక్ష 2’ నుండి ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని తీసుకొస్తారట. దీపక్ , మితిలేష్ , రామకృష్ణ , అపూర్వ లలో ఇద్దరు రాబోతున్నారు. రామకృష్ణ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా రావాలని అత్యధిక శాతం మంది కోరుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ టీం మాత్రం అతనికంటే మితిలేష్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. కాబట్టి మితిలేష్ , అపూర్వ లను మనం వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా చూడొచ్చు. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కోసం అయితే లేడీస్ కోసమే చూస్తున్నారట బిగ్ బాస్ టీం. ఎందుకంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ బాయ్స్ హాస్టల్ లాగా మారిపోయింది. అందుకే లేడీస్ కి ప్రాధాన్యత ఇస్తున్నారట. ప్రముఖ మూవీ హీరోయిన్ శీరత్ కపూర్ తో పాటు, సోనియా (మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ఫేమ్), ఆషిక వంటి కంటెస్టెంట్స్ ని సంప్రదిస్తున్నారు అట.

వీళ్ళతో పాటు సౌందర్య రెడ్డి అనే సీరియల్ హీరోయిన్ కూడా వైల్డ్ కార్డు గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మగవాళ్ళతో అయితే నూకరాజు, రాకేష్ లను సంప్రదించారట. వీళ్ళు వస్తే ఫన్ మామూలు రేంజ్ లో ఉండదు అనే చెప్పాలి. మొత్తం మీద 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ గా రాబోతున్నారు. మరి ఈ 8 మంది కారణంగా హౌస్ లో గేమ్ మారుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే రోహిత్ ఓటింగ్ ‘వార్ వన్ సైడ్’ అనే రేంజ్ లో సాగుతోంది. ఒకవేళ రామకృష్ణ ఎంట్రీ ఇస్తే రోహిత్ కి ఓటింగ్ లో చాలా గట్టి పోటీ ఇవ్వొచ్చు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper