Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan OG 2: ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లిన 'ఓజీ 2'..ఇదేమి క్రేజ్ బాబోయ్..

Pawan Kalyan OG 2: ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లిన ‘ఓజీ 2’..ఇదేమి క్రేజ్ బాబోయ్..

Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా?, ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉన్నాడు, ఇక సినిమాలకు దాదాపుగా రిటైర్మెంట్ ఇచ్చినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో , నిన్న సోషల్ మీడియా లో ఒక అను బాంబు పేలింది. ‘ఓజీ 2’ చిత్రం ఆన్ ది ట్రాక్ ఉందని , సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తామని […]

Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా?, ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉన్నాడు, ఇక సినిమాలకు దాదాపుగా రిటైర్మెంట్ ఇచ్చినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో , నిన్న సోషల్ మీడియా లో ఒక అను బాంబు పేలింది. ‘ఓజీ 2’ చిత్రం ఆన్ ది ట్రాక్ ఉందని , సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ టీం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ ఒక్క ప్రకటన సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు, ఈ ఒక్క ట్వీట్ కి దాదాపుగా 76 లక్షల వ్యూస్ కేవలం 24 గంటల్లో వచ్చాయి , ట్విట్టర్ మొత్తం ఓజీ 2 గురించే చర్చ, ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఎక్కడ చూసిన ‘ఓజీ 2’ మేనియా తో నిండిపోయింది.

దీని గురించి కేవలం టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ మాత్రమే కాదు , ఏకంగా హాలీవుడ్ కూడా చర్చించుకోవడం గమనార్హం. హాలీవుడ్ లో పాపులర్ మ్యాగజైన్ ‘వెరైటీ’ అనే సంస్థ , ‘ఓజీ 2’ గురించి ఒక ఆర్టికల్ రాసింది. ఈ చిత్రం నవంబర్ నెల నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని , మొదటి భాగం ప్రపంచవ్యాతంగా 35 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిందని , ఇది కేవలం తెలుగు వెర్షన్ కి సంబంధించిన వసూళ్లు మాత్రమే అని, ఓవర్సీస్ ప్రీమియర్స్ లో హాలీవుడ్ క్రేజీ సినిమాలను సైతం ఓజీ డామినేట్ చేసిందని అంటూ ఒక సంచలనాత్మక ఆర్టికల్ రాశారు. దీనిని చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ , కేవలం ఒకే ఒక్క ట్వీట్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఓజీ 2 గురించి చర్చలు నడిచాయి , ఈ సినిమాకు ఉన్న క్రేజ్, హైప్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper