Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ గా అనిపించే వారిలో ఒకరు యష్మీ. ఈమె ఆట తీరు మొదటి 5 వారాలు చాలా అద్భుతంగా ఉండేది. కచ్చితంగా ఈమె టాప్ 5 లోకి వెళ్తుందని అందరు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈమె నిఖిల్ గ్రూప్ లోకి వెళ్లిందో, అప్పటి నుండి తన గేమ్ తీరుని పూర్తిగా మార్చేసింది. నిఖిల్ ని ప్రేమిస్తూ , అతన్ని సంతోషపర్చడానికి ఈమె గేమ్స్ ఆడుతూ, మొదటి వారం నుండి ఈమె సంపాదించుకున్న పేరు మొత్తాన్ని పోగొట్టుకుంది. టాప్ 5 లో కచ్చితంగా ఉండాల్సిన ఈమె, ఇప్పుడు ఎలిమినేషన్ కి చాలా దగ్గర్లో ఉంది. మిగిలిన నాలుగు వారాల్లో ఎదో ఒక వారం ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ ప్రారంభంలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ తమ మొదటి లవ్ స్టోరీస్ గురించి చెప్పమంటాడు. అప్పుడు నిఖిల్ కావ్య తో తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు. మా ఇద్దరి మధ్య గొడవలై మా రిలేషన్ కి కాస్త బ్రేక్ వచ్చింది. కానీ నేను మాత్రం ఆమెని మర్చిపోలేను, నా అమ్మని ఎంత ప్రేమించానో, ఆమెని కూడా అంతే ప్రేమించాను,ఈ బిగ్ బాస్ షో పూర్తి అయిన వెంటనే ఆమె దగ్గరకి వెళ్తాను. నన్ను క్షమించమని బ్రతిమిలాడుతాను, ఒప్పుకోకపోతే లేపుకుని పోతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా నిఖిల్ చెప్పేటప్పుడు యష్మీ రియాక్షన్స్ చూస్తే అయ్యో పాపం అని అనిపించింది. ఈ క్లారిటీ నిఖిల్ ముందుగానే యష్మీ కి ఇచ్చి ఉండుంటే, ఆమె గేమ్ వేరేలా ఉండేది కదా, ఎందుకు నిఖిల్ ఇలా చేసాడు.
యష్మీ తో పలు సందర్భాల్లో నా మీద అంచనాలు పెట్టుకోకు అంటాడు. మళ్ళీ ఆయనే ఆమె వద్దకు వచ్చి బుగ్గ గిల్లడాలు, ముద్దు పెట్టుకోవడాలు వంటివి చేస్తాడు. మళ్ళీ కాసేపటికి ఇష్టం లేదంటాడు, ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది?, నిఖిల్ కి కూడా యష్మీ అంటే ఇష్టమే, కావాలని ఆమెని ఉడికించడానికి ఇలా చేస్తున్నాడు అనే కదా అనిపిస్తుంది. యష్మీ కూడా అలాగే భావించి నిఖిల్ మీద ఆశలు పెంచేసుకుంది. కేవలం అతని కోసమే గేమ్స్ ఆడుతూ వస్తుంది. ఇది బయట జనాలకు నిఖిల్ కేవలం గేమ్ కోసం యష్మీ ని ఉపయోగించుకున్నాడు అనే విధంగా అర్థమైంది. మరోపక్క నిఖిల్ మాజీ ప్రేయసి కావ్య తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో నిన్నటి నిఖిల్ కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ ‘మాయ మాటలతో ఎవ్వరిని మోసం చెయ్యకూడదు. ఫేక్ మనుషులు ఎప్పుడో ఒకసారి తమలోని అసలైన రంగులు బయటపెడుతారు. కేవలం వాళ్ళ మాస్కులు వీడెవరకు ఎదురు చూడాలి అంతే’ అంటూ నిఖిల్ కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Nikhils ex girlfriend kavya revealed sensational facts that nikhil used yashmi for his game
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com