Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ట్రైలర్ కారణంగా మంచి జోష్ మీద ఉన్నారు. సౌత్ ఇండియా లో ఈ ట్రైలర్ ఆల్ టైం రికార్డు నెలకొల్పడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. సినిమాకు కావాల్సినంత హైప్ కేవలం ఈ ఒక్క ట్రైలర్ తో రావడంతో ఇక ఓపెనింగ్స్ కి ఆకాశమే హద్దు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే ఈ నెల 24 వరకు ఆగాల్సిందే. ఇదంతా పక్కన పెడితే నేడు పవన్ కళ్యాణ్ మార్కాపురం లో 1290 కోట్ల రూపాయలతో త్రాగు నీటి పధకానికి శంకుస్థాపన చెయ్యడానికి వచ్చాడు. ఇక్కడికి చేరుకునే ముందు పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమారులు అకిరా నందన్(Akira Nandan), మార్క్ శంకర్(Mark Shankar Pawanovich) లను మంగళగిరి లోని తన నివాసానికి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
Also Read: నితిన్.. కథల ఎంపికలో ఇంత పూర్ నా? బడా నిర్మాత వస్తే ఒప్పుకుంటారా?
అక్కడ కాసేపు ప్రభుత్వ అధికారులతో, పార్టీ ముఖ్య నేతలతో పలు ముఖ్యమైన విషయాలను చర్చించాడు. అయితే పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కొడుకులతో ఉన్న ఫోటో ఒకటి లీకై సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. మార్క్ శంకర్ ని అభిమానులు పూర్తిగా చూడడం ఇదే తొలిసారి. ఎప్పుడో చిన్నప్పుడు కనిపించాడు, రీసెంట్ గా అగ్ని ప్రమాదం సమయం లో మరొకసారి కనిపించాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్క్ శంకర్ లుక్ ని రెవీల్ చేశారు. చూసేందుకు చాలా అందంగా ఉన్నాడు కానీ , పక్కనే ఉన్న అకిరా నందన్ మార్క్ శంకర్ ని డామినేట్ చేసాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అకిరా నందన్ లుక్స్ హాలీవుడ్ యాక్షన్ హీరో కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లోకి ఎప్పుడొస్తాడో తెలియదు కానీ,వచ్చిన రోజు మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో దున్నేస్తాడని అంటున్నారు ఫ్యాన్స్.
కానీ అకిరా తల్లి రేణు దేశాయ్ మాత్రం అకిరా సినిమాల్లోకి రావాలా వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని,సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చింది. కానీ అకిరా మాత్రం సైలెంట్ గా హైదరాబాద్ లోని యాక్షన్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు అంటూ రామ్ చరణ్ సైతం ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. మరి అకిరా ఎంట్రీ పై కొన్ని రోజులు సస్పెన్స్ తప్పదు అని అంటున్నారు ఫ్యాన్స్